ఏపీ అసెంబ్లీ సమావేశాలను గమనిస్తున్న వారు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ చేస్తున్న దూకుడును ప్రశంసి స్తున్నారు. వాస్తవానికి టీడీపీ అధినేత చంద్రబాబు తాను చేసిన శపథం నేపథ్యంలో సభకు రావడం లేదు దీంతో తమకు సభను డీల్ చేయడం ఈజీనేనని.. వైసీపీ నాయకులు భావించారు. మరీ ముఖ్యంగా సీఎం సహా సభాపతి కూడా టీడీపీ అధినేత రంగంలో లేకపోవడంతో తమకు పని సులువు అవుతుందని అనుకున్నారు. కానీ.. అలా జరగడం లేదు. పైగా ఉన్న 16 మంది టీడీపీ ఎమ్మెల్యేలు కూడా అధికార పార్టీకి చుక్కలు చూపిస్తున్నారనే వాదన వినిపిస్తోంది.
నిజానికి ఇప్పుడు సభలో 16 మంది టీడీపీ ఎమ్మెల్యేలే ఉన్నప్పటికీ.. అసెంబ్లీలో టీడీపీ సత్తా చాటుతు న్నారు. దీంతో ప్రభుత్వంపై పైచేయి సాధించేలా వ్యవహరిస్తున్నారని మేధావులు సైతం అంటున్నారు. ముఖ్యంగా జంగా రెడ్డి గూడెం ఘటనకు సంబంధించి.. అసెంబ్లీలో టీడీపీ నేతలు ఆసక్తికర వాయిస్ వినిపించారు. ఈ క్రమంలో అధికార పార్టీ సభ్యులు.. ఆచి తూచి వ్యవహరించాల్సిన పరిస్థితిని కల్పించా రు. గతంలో చంద్రబాబు అధ్యక్షతన పార్టీ నాయకులు అసెంబ్లీలో గళం వినిపించేవారు.
అయితే.. ఇప్పుడు .. చంద్రబాబు సభకు వెళ్లడంలేదు. దీంతో టీడీపీలో లోటు కనిపిస్తుందని… అధికార పక్షం సభలో పైచేయి సాధించడం ఖాయమని అంచనాలు వచ్చాయి. అంతేకాదు.. సభలో పార్టీ నేతలు వాయిస్ కూడా వినిపించే ప్రయత్నం చేయలేరని కూడా కొందరు వైసీపీ నేతలు భావించారు. అయితే.. అనూహ్యంగా టీడీపీ నాయకులు.. అధికార పార్టీపై పుంజుకునే ప్రయత్నం చేశారు. గవర్నర్ ప్రసంగం రోజు.. నుంచి వరుసగా వారు సభలో అధికార పార్టీని నిలదీసిన వైనం.. ఇప్పటి వరకు జరిగిన సమావేశాల్లో టీడీపీ అనుసరించిన వ్యూహాలకు భిన్నంగా ఉందనే వాదన వినిపిస్తోంది.
అదేవిధంగా బడ్జెట్‌పైచర్చ సందర్భంగా.. జంగారెడ్డి గూడెం మరణాల అంశాన్ని ప్రస్తావించారు. ఈ పరిణామం.. ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టింది. అంతేకాదు.. ఎదురు దాడి చేసి… ఆత్మరక్షణ పరిస్థితిని ఎదుర్కొనాల్సి రావడం వైసీపీకి మరింత ఇబ్బంది కరంగా మారింది. అయితే.. ఇక్కడ టీడీపీ నేతల దూకుడు.. వారు సస్పెండ్ అయ్యేలా దారితీస్తోంది. ఈ విషయంలో వారు మరింత జాగ్రత్తగా ఉంటే.. పార్టీ వాయిస్ వినిపించేందుకు అవకాశం ఉంటుందని.. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నించినట్టు కూడా ఉంటుందని మేధావులు చెబుతున్నారు. ఈ ఒక్క విషయంలో జాగ్రత్తలు తీసుకుని.. సస్పెండ్ కాకుండా.. చూసుకోవాలని.. దూకుడు మాత్రం కొనసాగించాలని.. మేధావులు నుంచి కూడా సూచనలు వస్తున్నాయి. మరి ఏం చేస్తారోచూడాలి.
This post was last modified on March 20, 2022 5:42 pm
తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…
హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…
చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…
దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…