Political News

కొడాలి – వంగవీటి.. ఆటలో టీ తాగుతూ..

రాజకీయాల్లో శాశ్విత మిత్రులు.. శాశ్విత శత్రువులు అనేటోళ్లు ఉండరు. రాజకీయంగా నిప్పులా ఉప్పులా ఉండే వారు సైతం వ్యక్తిగత జీవితాల్లో మాత్రం మంచి స్నేహితులుగా ఉండొచ్చు. అందుకు ఉదాహరణగా ఏపీ మంత్రి కొడాలి నాని.. టీడీపీ నేత వంగవీటి రాధాలను చెప్పొచ్చు. ఈ ఇద్దరు ఫైర్ బ్రాండ్ నేతలు తూర్పు పడమర లాంటి పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నా.. వీరిద్దరి మధ్య స్నేహం మాత్రం రాజకీయాలకు అతీమని చెబుతుంటారు.

ఏపీ అధికార విపక్ష పార్టీ నేతలు కలవటం సంగతి తర్వాత.. ముఖ ముఖాలు చూసుకునే పరిస్థితి లేదు.
అలాంటి వేళలో కొడాలి నాని.. వంగవీటి రాధాలు ఇద్దరూ ఒకే ఆటోలో కూర్చొని చాలా సింఫుల్ గా టీ తాగుతూ ముచ్చట్లు చెప్పుకున్న వైనం తాజాగా చోటు చేసుకుంది.

ఈ అరుదైన సీన్ కు వేదికగా గుడివాడలో చోటు చేసుకుంది. గుడివాడ మాజీ వైస్ ఛైర్మన్ అడపా వెంకట రమణ (బాబ్జి) అంతిమ యాత్రకు మంత్రి కొడాలి నానితో పాటు.. టీడీపీ నేత వంగవీటి రాధలు హాజరయ్యారు. తమకు సన్నిహితుడైన బాబ్జి భౌతికకాయానికి నివాళులు అర్పించిన అనంతరం ఈ ఇద్దరు నేతలు అతి సాధారణంగా అక్కడే ఉన్న ఒక ఆటోలో కూర్చున్నారు. ఈ ఫైర్ బ్రాండ్ నేతల మధ్య మంచి స్నేహం.. సాన్నిహిత్యం ఉందన్న విషయం తెలిసిందే.

ఏదోలా వంగవీటి రాధను మంత్రి కొడాలి నాని వైసీపీలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ అది వర్కువుట్ కాలేదు. ఈ విషయాన్ని పక్కన పెడితే.. ఈ ఇద్దరు ఫైర్ బ్రాండ్ నేతలు తమ ఇమేజ్ ను.. తమకున్న పలుకుబడిని పక్కన పెట్టేసి.. ఒకే ఆటోలో.. సాదాసీదాగా కూర్చొని.. పేపర్ కప్పుల్లో టీ తాగిన సందర్భంగా పలువురు వారిద్దరు కలిసి ఉన్న రేర్ కాంబినేషన్ ను ఫోటోలుగా తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి తాజాగా వైరల్ గా మారింది. తెలుగు రాజకీయాల్లో.. అందునా ఏపీ పాలిటిక్స్ లో ఇలాంటి సీన్ అరుదైనదనే చెప్పాలి.

This post was last modified on March 20, 2022 1:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హింసను ఇష్టపడుతున్న 5జి ప్రేక్షకులు

ఇప్పుడంతా ఇంటర్ నెట్ ప్రపంచం. కొన్ని నిముషాలు మొబైల్ డేటా లేకపోయినా, ఇంట్లో వైఫై పనిచేయకపోయినా ఏదో భూమి బద్దలైపోయి…

29 minutes ago

మహేష్ – రాజమౌళి : ఇది కూడా రహస్యమేనా జక్కన్నా…

ఈ సోషల్ మీడియా కాలంలో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి కూడా ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు లీక్ అయిపోతుంటాయి.…

2 hours ago

రిలీజ్ డేట్స్ తో కొత్త సినిమాల తంటాలు !

ముందో విడుదల తేదీ అనుకుని పోటీ వల్ల వెనుకడుగు వేసి ఇప్పుడు కొత్త డేట్ పట్టుకునేందుకు కిందా మీద పడుతున్న…

3 hours ago

రాజకీయాన్ని మార్చబోయే ‘గేమ్ ఛేంజర్’ ఆట!

https://youtu.be/zHiKFSBO_JE?si=HDSpx4GNEhcOje0y కొత్త సంవత్సరం తొలి ప్యాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ జనవరి 10 విడుదల కాబోతున్న నేపథ్యంలో అందరి…

3 hours ago

భారీ కుంభకోణంలో చిక్కుకున్న భారత యువ క్రికెటర్లు!

టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో పాటు యువ క్రికెటర్లు సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మలు ఓ…

4 hours ago