ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం రాష్ట్రంలో పని చేసే ప్రభుత్వ వైద్యులకు గుదిబండలా మారడమే కాదు.. పేషెంట్లకు వైద్యం చేయటం కంటే.. రోజువారీగా పోస్టు చేయాల్సిన సెల్ఫీలతోనే పుణ్యకాలం గడిచేలా తాజా నిర్ణయం ఉందంటున్నారు. ఏపీలోని జగన్ సర్కారు తీసుకున్న ఈ సెల్ఫీ నిర్ణయంపై వైద్యులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసేలా తాజా మార్గదర్శకాలు ఉన్నాయని చెబుతున్నారు.
కొత్తగా తీసుకొచ్చిన సెల్ఫీ పాలసీ ప్రకారం చూస్తే.. ఏపీ వ్యాప్తంగా ఉండే ప్రభుత్వ వైద్యులు ప్రతి రెండు గంటలకు ఒకసారి తమ సెల్ఫీని పోస్టు చేయాల్సి ఉంటుంది. అది కూడా తాము పని చేసే ఆసుపత్రి ఆవరణ స్పష్టంగా కనిపించాలి. ఈ తీరులో రోజుకు ఐదు సార్లు సెల్ఫీలు దిగి పోస్టు చేయటంతో పాటు.. ఈ లెక్కలో ఏ చిన్న తేడా వచ్చినా నెలవారీ జీతంలో కోత పెడతామన్న మాటపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
అంతేకాదు.. ప్రభుత్వ వైద్యులు తమ ఇంటి వద్ద చేసుకునే ప్రైవేట్ ప్రాక్టీస్ విషయంలోనూ పరిమితులు విధించారు. దీంతో.. వారంతా రోజు మొత్తం ప్రభుత్వ ఆసుపత్రికే పరిమితం కావాలే తప్పించి.. ప్రైవేటు ప్రాక్టీసు వైపు కన్నెత్తి చూసే అవకాశం ఉండదని చెబుతున్నారు. తాజా నిర్ణయంతో ఏపీని సెల్ఫీ ప్రదేశ్ గా మారుస్తున్నారన్న మండిపాటు వ్యక్తమవుతోంది. కొత్తగా తీసుకురావాలని భావిస్తున్న ఈ సెల్ఫీ విధానానికి కచ్చితమైన మార్గదర్శకాల్ని సిద్ధం చేస్తున్నారు.
ఇప్పటికే బయో మెట్రిక్ తోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. అది సరిపోదన్నట్లుగా ఇప్పుడు ఏకంగా సెల్ఫీలు దిగి పోస్టు చేయటం.. వాటిల్లో ఆసుపత్రి బ్యాక్ గ్రౌండ్ పక్కాగా ఉండాలని చెబుతున్న వైనంపై మండిపాటు వ్యక్తమవుతోంది. రోజుకు ఐదు సెల్ఫీలు పోస్ట్ చేయాలన్న ఆలోచనపై మహిళా వైద్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది తమను ఇబ్బందులకు గురి చేస్తాయని వాదిస్తున్నారు. సెల్ఫీలు ఏ మాత్రం అప్ లోడ్ చేయకున్నా.. జీతాల్లో కోత పెడతారన్న మాటపై ఆందోళన వ్యక్తమవుతోంది. మరి.. వైద్యుల విషయంలో అమల్లోకి రానున్న ఈ సెల్ఫీ పరీక్ష జగన్ ప్రభుత్వంపై మరింత నెగిటివిటీ పెంచేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
This post was last modified on March 18, 2022 4:47 pm
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…