రాజకీయ యుద్ధంలో ఒక్కడ్నే వస్తా అని అంటున్నారు జగన్.. ఆయన తరుఫున ఒక్కడే ఆ మాట కూడా అంటున్నారు ఆయనే పేర్ని నాని. పవన్ స్పీచ్ అవ్వగానే మంత్రి మాటలు కొన్ని ఆయన అభద్రతాభావానికి సంకేతాలు అని అంటున్నాయి జనసేన వర్గాలు. తాము అందరినీ గౌరవిస్తామని ఆ కోవలో మంత్రి కూడా ఉంటారని అయితే తప్పులు చేస్తే భరించేంత శక్తి కానీ ఓపిక కానీ లేవని స్పష్టం చేస్తున్నారు పవన్. ఇదే మాట నిన్న పదే పదే చెప్పారు సహజ వనరుల దోపిడీని ఆపడం జనసేన ముందున్న కర్తవ్యం అని పదే పదే అన్నారు.
దీనిపై పేర్ని నాని ఎందుకు మాట్లాడరు అని విధాన సంబంధ నిర్ణయాలపై మాట్లాడకుండా వ్యక్తిగత విషయాలను ఆయనెందుకు ఫోకస్ చేస్తారని మండిపడుతున్నారు జనసైనికులు. ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేని జనసేన అంటే ఎందుకింత భయం అనిఅంటున్నారు పవన్ కల్యాణ్. తమ దగ్గర ఆస్తులు లేవు అని ఆత్మాభిమానం మెండుగా ఉందని నిన్నటి వేళ మరోమారు చెప్పే ప్రయత్నం ఒకటి చేశారు.
ముఖ్యంగా ఇది ఆధిపత్యానికి ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న యుద్ధం అని తేల్చేశారు పవన్ కల్యాణ్. ఆవిర్భావ సభలో పవన్ చెప్పిన ప్రతిమాటకూ పేర్నినాని కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు.ఎన్ని కలలు కన్నా కూడా జగన్ ను దాటి గెలుపు సాధించి తీరడం అసాధ్యం అని తేల్చేశారు. బీజేపీనీ టీడీపీనీ కలిపి ఉంచేందుకే పవన్ సిద్ధం అవుతున్నారా? అన్నది నాని ప్రశ్న.దీనిపై కూడా జనసేన కౌంటర్లు ఇస్తోంది.
2014లో ఆ రోజు తాము కలిసి పనిచేయడం వల్లనే స్థిరమయిన రీతిలో ప్రభుత్వం ఏర్పాటు సాధ్యం అయిందని,అయినా కూడా రాజధాని గ్రామాల రైతుల సమస్యలపై పోరాటం చేశామని గుర్తు చేస్తున్నారు.తాము మద్దతు ఇచ్చినంత మాత్రాన పోరాటం ఆపబోమని మరో మారు స్పష్టం చేస్తున్నారు పవన్ మరియు ఆయన అభిమానులు కూడా! జీవితం ఇచ్చిన చిరంజీవిని మరిచిపోవడం అస్సలు జరగని పని అని అంటోంది పవన్ వర్గం. అన్ని వేడుకల్లోనూ వేదికలపై ఆయన పేరు ప్రస్తావించనంత మాత్రాన గౌరవం లేదు అని ఎలా అనుకుంటారు..కుటుంబంలో చిచ్చు పెట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయండి అవేవీ నెగ్గవు అని కూడా అంటున్నారు జనసేన అభిమానులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates