జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేదికగా.. ప్రజలకు సంచలన హామీలు ఇచ్చారు. 2024లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. పార్టీని పుంజుకునేలా చేస్తామన్నారు. తాము అధికారంలోకి రాగానే సమూల మార్పుల దిశగా.. శ్రీకారం చుడతామని తెలిపారు. కర్నూలు జిల్లా పేరును మార్చి.. దళిత పితామహుడు దామోదరం సంజీవయ్య పేరును పెడతామన్నారు.
అదేవిధంగా ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదరు చూస్తున్న సీపీఎస్(కంట్రి బ్యూటరీ పింఛన్‌ను)ను రద్దు చేస్తామని ప్రకటించారు. అంతేకాదు.. పాత పింఛను విధానాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. అప్పులు లేని ఆంధ్రప్రదేశ్ సాకారమే తమ లక్ష్యమని పవన్ చెప్పారు. వైసీపీ నేతలు ఒళ్లు పొగరెక్కి.. అధికార గర్వంతో మాట్లాడు తున్నారని విరుచుకుపడ్డారు. ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీలు.. అధికారంలోకి రాగానే మర్చిపోయారని అన్నారు. అంతేకాదు.. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేసుకునేందుకు మూడున్నర కోట్ల రూపాయలను వృథా చేశారని చెప్పారు.
ఒక కులాన్ని వర్గ శత్రువుగా ఎలా చూస్తారని.. సీఎం జగన్‌ను పవన్ సూటిగా ప్రశ్నించారు. తాను కులాలను ప్రేమిస్తానని.. అన్ని కులాలు ఐక్యంగా ఉండాలని కోరుకుంటానని..పవన్ చెప్పారు. జనసైనికులు కొదమ సింహాల మాదిరిగా గర్జించాలని పవన్ పిలుపునిచ్చారు. సభకు వచ్చిన ప్రతి ఒక్కరూ.. ఒక్కొక్క కొదమ సింహమని పేర్కొన్నారు.
తాము అధికారంలోకి వస్తే.. అల్పాదాయ వర్గాలకు ఉచితంగా ఇసుకను ఇస్తామని.. పవన్ సంచలన హామీ ఇచ్చారు.అ దేసమయంలో.. ప్రతి ఏటా 5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి.. నిరుద్యోగ సమస్యలను పారద్రోలుతామన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటును ఏకం చేస్తామని..వ చ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి పుట్టగతులు లేకుండా చేస్తామని.. పవన్ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో కొత్త పారిశ్రామిక విధానం తీసుకువస్తామని.. పవన్ చెప్పారు. అదేవిధంగా తాము అధికారంలోకి రాగానే.. ఉద్యోగుల పీఆర్సీలో సమూల మార్పులు తెచ్చి.. వారిని సంతోష పెడతామన్నారు.
This post was last modified on March 15, 2022 12:06 am
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్‌కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…