టిడిపి ఎంపీ, ఎమ్మెల్యే మధ్య రేగిన వివాదం ముగిసినట్లేనా? కొలికపూడి శ్రీనివాసరావు, కేశినేని చిన్ని మధ్య నెలకొన్న విభేదాలు సమస్య పోయినట్లేనా..? ఈ ప్రశ్నలకు స్వయంగా ఎమ్మెల్యే కొలికపూడి సమాధానం చెప్పారు. తిరువూరు నియోజకవర్గంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న రాజకీయ వివాదాలు ముగిసినట్లేనని ఆయన తెలిపారు.
అసెంబ్లీ లాబీలో ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అల్లా శ్రీనివాసరావును కలిసిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాలు, ఎంపీ కేశినేని చిన్నితో తలెత్తిన వివాదంపై చర్చించినట్లు వెల్లడించారు.
తన చర్యలు పార్టీకి ఇబ్బందులు కలిగించి ఉంటే చింతిస్తున్నానని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటానని కొలికపూడి పేర్కొన్నారు. ఇకపై ఏ సమస్య ఉన్నా జోనల్ కోఆర్డినేటర్, జిల్లా పార్టీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్తానన్నారు.
తన నియోజకవర్గంలో ఎంపీకి ఇవ్వాల్సిన గౌరవాన్ని తప్పకుండా ఇస్తానని, అదే సమయంలో ఆయన నుంచి కూడా అదే గౌరవం ఆశిస్తున్నానని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం కులం కార్డు వాడటం తన అభిమతం కాదని స్పష్టం చేశారు. ఇటీవల తిరువూరులో జరిగిన పరిణామాలు పార్టీ ప్రతిష్ఠకు ఇబ్బందులు కలిగించి ఉంటే తనకు విచారం ఉందని తెలిపారు. ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.
ఇదివరకు ఎమ్మెల్యే కొలికపూడి కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే టికెట్ కోసం రూ.5 కోట్లు తీసుకున్నారని ఎంపీ కేశినేని చిన్నిపై ఆరోపిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తన అకౌంట్ నుంచి ఎవరికెంత డబ్బు బదిలీ చేశారో ఆధారాలతో వెల్లడిస్తానని కూడా పేర్కొన్నారు.
తాజాగా తన ప్రాణాలకు ముప్పు ఉందని కూడా కొలికపూడి ఆరోపించారు. నెమలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ కళ్యాణోత్సవం సందర్భంగా తనపై దాడి చేసేందుకు కుట్ర జరిగిందని వ్యాఖ్యానించారు. ఎంపీ కార్యాలయం నుంచే జనాన్ని సమీకరించారని ఆరోపించారు. ఈ పరిణామాలపై స్పందించిన అధిష్టానం పార్టీ నేతల మధ్య విభేదాలు పార్టీకి నష్టం కలిగిస్తాయని పేర్కొని సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. ప్రస్తుతం వివాదం ముగిసినట్లేనని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
అయితే కొలికపూడి మాటలు నమ్మశక్యంగా లేవని, ఇలా చెబుతూనే పదే పదే తప్పులు తిరిగి చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈసారైనా కొలికపూడి ఆయన మాటలకు కట్టుబడి ఉంటారా లేదా అనేది వేచి చూడాలి.
This post was last modified on March 6, 2026 6:56 pm
ఈ శుక్రవారం ఒకేసారి నాలుగైదు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. ఇంత పోటీలో వస్తున్నపుడు ప్రేక్షకుల దృష్టి తమ చిత్రం మీద…
ఏఐ దుర్వినియోగమవుతున్న తీరు చూస్తుంటే టెక్నాలజీ తాలూకు పరిణామాలు ఇంత దారుణంగా ఉంటాయా అనిపిస్తుంది. రోబోలో ఒక యంత్రం హీరోయిన్…
ఫిలిం సెలబ్రెటీలు పబ్లిక్‌లోకి రావాలంటే భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయిప్పుడు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని ఎక్కడికైనా సరే జనం…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు ఎన్ని స్థానాల్లో గెలవబోతున్నాయి? వైసీపీకి ఎన్ని స్థానాలు…
భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…