మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కలయికలో తెరకెక్కబోయే సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తారనే వార్తలు మొన్నటి దాకా చక్కర్లు కొట్టాయి. కానీ ఇప్పుడు తమన్ కు ఆ ఛాన్స్ దొరికినట్టు వస్తున్న అప్డేట్ అభిమానుల్లో ఒక రకమైన కన్ఫ్యూజన్ ఏర్పరిచింది. ఎందుకంటే పెద్దికి రెహమాన్ అవుట్ స్టాండింగ్ వర్క్ చేశారు. రెండు పాటలు, టీజర్ అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.
తగ్ లైఫ్ లో మణిరత్నం అంతటి లెజెండ్ కూడా రాబట్టుకోలేకపోయినా క్వాలిటీ అవుట్ ఫుట్ ని బుచ్చిబాబు అనే ఒక్క సినిమా అనుభవమున్న దర్శకుడు బుచ్చిబాబు చేయించుకోవడం మాములు విశేషం కాదు. సో మెగా ఫ్యాన్స్ కు రెహమాన్ మీద ఫుల్ పాజిటివ్ కార్నర్ ఉంది. అలాంటప్పుడు బాబీ మూవీకి కూడా తనే అయ్యుంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం కావడం సహజం.
అయితే ఇక్కడో విషయం గమినించాలి. రెహమాన్ పెద్దికి బెస్ట్ ఇస్తున్న మాట నిజమే కానీ ఆ మేజిక్ ప్రతిసారి రిపీట్ అవుతుందన్న గ్యారెంటీ లేదు. గత పదేళ్లలో ఆయన నుంచి వచ్చిన క్రేజీ ఆల్బమ్స్ వేళ్ళ మీద లెక్కబెట్టవచ్చు. సో మెగా మూవీకి ఓకే చేయించుకున్నా రిస్క్ ఉండదన్న గ్యారెంటీ లేదు. ఇక తమన్ విషయానికి వస్తే భీమ్లా నాయక్, గాడ్ ఫాదర్ లాంటి యావరేజ్ కంటెంట్లకు సైతం మంచి బిజిఎం ఇచ్చాడు. ఓజికి సగం హైప్ రావడంలో సుజిత్ విజువల్స్ తో పాటు ఎక్కువ డ్యూటీ చేసింది తమన్ పాటలే.
సో ఇలా చూసుకుంటే తమన్ ని ఎంచుకోవడం తెలివైన ఎంపికే అవుతుంది. కొందరు గేమ్ ఛేంజర్ గుర్తు చేయొచ్చు కానీ అసలు ప్రోడక్ట్ తేడా కొట్టి శంకర్ కు సంగీతం మీద గ్రిప్ తగ్గినప్పుడు అంత కన్నా పాటలు ఆశించలేం. కానీ బాబీకి మ్యూజిక్ టేస్ట్ ఉంది. వాల్తేరు వీరయ్యకు దేవిశ్రీ ప్రసాద్, డాకు మహారాజ్ కు తమన్ తో చక్కగా చేయించుకున్నాడు. అసలే టైం తక్కువగా ఉంది. చిరు బాబీ మూవీని 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ప్రాధమిక లక్ష్యంతో ఉన్నారు. అది నెరవేరాలంటే రెహమాన్ తో కుదరదు. తమన్ అయితే హైదరాబాద్ లోనే ఉంటాడు కాబట్టి చాలా సమస్యలను రాకుండా చూసుకోవచ్చు. చూడాలి మరి ఏం చేస్తారో.
This post was last modified on March 6, 2026 6:05 pm
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…