ల్పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు అభిమానులు కోట్ల మందిలో ఉన్నారు.అందులో ఇరు తెలుగు రాష్ట్రాలకూ చెందిన మంత్రులు కూడా ఉన్నారు.కేటీఆర్ కూడా ఉన్నారు. ఆ మాటకు వస్తే మనం రోజూ కోపం పడే మనుషులెందరో ఉన్నారు.అదేం తప్పు కాదు.ఆ మాటకు వస్తే కొడాలి నాని,పేర్ని నాని కూడా ఓ విధంగా పవన్ అభిమానులే! నో డౌట్ ఇన్ ఇట్. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి కూడా ఓ విధంగా పవన్ అభిమానే!
వాళ్లుఇప్పుడు ఒప్పుకోరు కానీ ఒకప్పుడు వీళ్లంతా పవన్ వెంట నడిచేందుకు తాపత్రయపడిన వాళ్లే. పీఆర్పీ సమయంలో వీళ్లంతా ఏదో ఒక గూటికి చేరుకుని తమ హవా చూపించాలని తాపత్రయపడిన వారే! ఆ మాటకు వస్తే ఏపీ కన్నా తెలంగాణలోనే పవన్ హవా ఎక్కువ. తెలంగాణ కళాకారులను నెత్తిన పెట్టుకుని పవన్ పూజిస్తారు. వారికో జీవితం ఇచ్చి ఆదుకుంటారు. అలా అని ఆంధ్రా కళాకారులకేం చేయలేదని కాదు.
ఇక కార్యకర్తలెవరు అన్న డిబేట్ లోకి వస్తే ఇవాళ్టికీ క్షేత్ర స్థాయిలో పవన్ పార్టీకి చెప్పుకోదగ్గ కార్యకర్తలు లేరు. మండల మరియు గ్రామ కార్యవర్గాలు పూర్తి స్థాయిలో లేవు. ఉన్నా కూడా అవి పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు అన్నదే ఓ వాస్తవం. ఆ మాటకు వస్తే జిల్లా కార్యాలయాలే జనసేనకు లేవు. శ్రీకాకుళం జిల్లాలో ఒకప్పుడు ఒక అద్దె భవంతిలో నడిచిన కార్యాలయం గత ఎన్నికలు కాగానే మూతపడింది.ఇదేవిధంగా చాలా చోట్ల జిల్లా కార్యాలయాలు కానీ జిల్లా కార్యవర్గాలు కానీ ఆ మాటకు వస్తే జిల్లా ఇంఛార్జిలు కానీ ఇలా ఎవరు ఏంటి అన్నది కూడా తెలియని డైలమా నెలకొని ఉంది.
వాస్తవానికి కొందరు పవన్ అభిమానులం అని చెప్పుకుంటూ సోషల్ మీడియాలో అనవసర వాగ్యుద్ధాలు చేస్తున్నారు.కానీ వీళ్లెవ్వరూ క్షేత్ర స్థాయిలో పనిచేయరు సరికదా చేసే వాళ్లకు కూడా అడ్డంకిగా ఉంటారు. పవన్ దగ్గరకు పోయి ఒన్ సెల్ఫీ ప్లీజ్ సర్ అని గారాలు పోయిన వారే తప్ప వీరంతా పార్టీ కోసం పనిచేసే బాపతు కాదు. అందుకే పవన్ విషయమై ఇప్పటికీ కార్యకర్తలెవ్వరు ? అభిమానులెవ్వరు ? అన్నది తేలడం లేదు.
This post was last modified on March 14, 2022 4:10 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…