నాలుగు రాష్ట్రాల్లో విజయం కారణంగా తెలంగాణాలో బీజేపీ నేతలు కేసీయార్ పై రెచ్చిపోతున్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణాలో అధికారంలోకి రాబోయేది తామేనంటు నానా రచ్చ మొదలుపెట్టేశారు. ఎక్కడో నాలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావటం వేరు తెలంగాణాలో గెలవటం వేరన్న విషయాన్ని కమలనాదులు మరచిపోయారు. పైగా ఇప్పటికే కేసీయార్ పై బీజేపీ నేతలు రెచ్చిపోతు నోటికొచ్చింది మాట్లాడుతున్నారు.
ఇలాంటి నేపధ్యంలో నాలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక ఆగుతారా ? జాతీయ రాజకీయాల్లో చక్రంతిప్పాలని, నరేంద్రమోడికి ప్రత్యామ్నాయంగా ఎదగాలని కలలుకంటున్న కేసీయార్ కు చుక్కలు చూపిస్తామంటు బీజేపీ నేతలు అప్పుడే వార్నింగులిచ్చేస్తున్నారు. నిజానికి తెలంగాణాలో అధికారంలోకి వచ్చేసేంత సీన్ కమలనాదులకు లేదు. ఎందుకంటే క్షేత్రస్ధాయిలో సంస్ధాగతంగా పార్టీకి అసలు బలమే లేదు. కాకపోతే జనాలు ప్రత్యామ్నాయం కోసం చూసినపుడు పార్టీకి సంస్ధాగతంగా బలముందా లేదా అన్నది చూడరు.
దీనికి ఉదాహరణ 2019 ఎన్నికల్లో బీజేపీ నాలుగు లోక్ సభ సీట్లలో గెలవటమే. కేసీయార్ కూడా తనను తాను చాలా ఎక్కువగా అంచనా వేసుకుని డైరెక్టుగా మోడీపైనే రెచ్చిపోతున్నారు. మోడికి వ్యతిరేకంగా జాతీయ స్ధాయిలో వేదికను ఏర్పాటు చేస్తానని పదే పదే చెప్పి నాన్ బీజేపీ నాన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రులను వరుసగా కలుస్తున్నారు. అయితే వారిలో ఎందరినుండి మద్దతొచ్చిందనే విషయంలో క్లారిటిలేదు.
ఇప్పటికైతే బెంగాల్ సీఎం మమతాబెనర్జీ నుండి మాత్రమే కేసీయార్ కు మద్దతొచ్చిందట. ఇంతోటిదానికే మోడికి వ్యతిరేకంగా కేసీయార్ రెచ్చిపోతున్నారు. ఈ నేపధ్యంలో వెలువడిన ఎన్నికల ఫలితాలు కచ్చితంగా కేసీయార్ ఆశలపై నీళ్ళు చల్లేవే. ఇందుకనే బీజేపీ నేతలు రెచ్చిపోతున్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణాలో కచ్చితంగా అధికారంలోకి వచ్చేయటం ఖాయమంటు రచ్చ మొదలుపెట్టేశారు. ఇప్పటికే రోజుకో సమస్యను తీసుకుని కేసీయార్ ను ఊపిరి ఆడనీయటంలేదు. కాబట్టి ఆ ఎన్నికలేదో తొందరగా వచ్చేస్తే బాగుండి గోల తగ్గుతుంది.
This post was last modified on March 10, 2022 7:10 pm
ముందు విడుదల తేదీని ప్రకటించుకుని, ఆ తర్వాత పోటీదారులు వస్తే తప్పని పరిస్థితుల్లో డేట్ మార్చుకునే పరిస్థితి చిన్న సినిమాలకే…
ఏపీలో రాముడి తరహా రామరాజ్యం తీసుకురావాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. రామరాజ్యం అంటే.. ఏపీ సమగ్ర అభివృద్ధి…
తమిళనాడులో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు పెట్టుకోవడంపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.…
హీరోలు మాత్రమేనా పాన్ ఇండియా రేంజికి వెళ్లేది.. నిర్మాతలు వెళ్లలేరా అన్నట్లు బహు భాషల్లో సినిమాలు తీస్తూ దూసుకెళ్తోంది టాలీవుడ్ అగ్ర…
సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు ఎంతకు తెగిస్తున్నారన్న దానికి ఈ ఘటన నిలువెత్తు నిదర్శనమని చెప్పక తప్పదు. జనసేన అధినేత, ఏపీ…
వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు శుక్రవారం ఊహించని షాక్ తగిలింది. పోలీసుల అదుపులోని నిందితుడిపై…