తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలుగు సినిమాల తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం విశేషం. తెలుగు చిత్రాల్లో తెలంగాణ యాస వాడుక గురించి ఆయన ఈ వ్యాఖ్యలుచేశారు. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో తెలంగాణ యాసను హాస్యాస్పదంగా చూపించేవారని.. విలన్ పాత్రలకు, కమెడియన్లకు తెలంగాణ స్లాంగ్ వాడేవారని.. కానీ ఇప్పుడు హీరోలకు ఈ స్లాంగ్ పెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించడం విశేషం.
కేసీఆర్ చెప్పిన మాట వాస్తవమే. తెలుగు సినిమాల్లో ఈ మార్పు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. 2000కు ముందు అయితే తెలుగు చిత్రాల్లో తెలంగాణ యాసకు అసలు ప్రాధాన్యమే ఉండేది కాదు. విలన్లు, కమెడియన్లకే ఈ యాసను వాడేవారు. ఐతే ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమం మొదలయ్యాక క్రమంగా మార్పు రావడం మొదలైంది. హీరోలు తెలంగాణ యాస మాట్లాడ్డం లాంటి మార్పేమీ కనిపించలేదు కానీ.. ఆ యాసను తక్కువ చేసేలా పాత్రలు, డైలాగ్స్ పెట్టడం తగ్గిపోయింది.
ఇక 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాక వేగంగా పరిస్థితులు మారిపోయాయి. ఒకప్పట్లా తెలంగాణ నేపథ్యంలో కన్నీటి చిత్రాలు, ఉద్యమ సినిమాలు కాకుండా ఇక్కడి నేపథ్యంలో మెయిన్ స్ట్రీమ్ సినిమాలు, ఎంటర్టైనర్లు రావడం మొదలైంది. ముఖ్యంగా పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి లాంటి అర్బన్ బేస్డ్ సినిమాలతో తెలంగాణ యాసను చూసే కోణమే మారిపోయింది.
విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి లాంటి నటులు.. సందీప్ రెడ్డి, తరుణ్ భాస్కర్ లాంటి దర్శకులు ‘తెలంగాణ’ సినిమా కలరే మార్చేశారు. క్రమంగా తెలంగాణ అర్బన్ బేస్డ్ సినిమాలకు ఆదరణ పెరిగింది. ఇటీవలి కాలంలో సిద్ధు జొన్నలగడ్డ కూడా తెలంగాణ యాసకు పాపులారిటీ తెచ్చాడు. తాజాగా అతడి సినిమా ‘డీజే టిల్లు’ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. ఈ సినిమాలో కూడా తెలంగాణ యాసను చాలా అందంగా వాడుకున్నారు. డైలాగ్స్‌కు అదే ప్లస్ అయింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఈ వ్యాఖ్య చేసినట్లున్నారు
This post was last modified on March 9, 2022 6:29 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…