Political News

ఎగ్జిట్ పోల్స్‌.. బీజేపీకే యూపీ ప్ర‌జ‌ల ప‌ట్టం

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఈ క్రమంలో అతి పెద్ద రాష్ట్రం, బీజేపీ నేత‌లు అత్యంత కీల‌కంగా తీసుకున్న రాష్ట్రం యూపీలో ఓటర్లు మళ్లీ బీజేపీకే అధికారాన్ని కట్టబెట్టనున్నట్లు పలు సర్వే సంస్థలు అంచనా వేశాయి. ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఏడో విడత పోలింగ్తో.. మినీ సార్వత్రిక సమరంగా భావించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.

అంతకుముందే.. ఫలితాల ధోరణిని అంచనా వేస్తూ విశ్లేషిస్తూ ఎగ్జిట్ పోల్స్.. అధికారం ఎవరిదోనని చెప్పేస్తాయి. సర్వేల ద్వారా ఓటర్ల నాడిని పసిగడతాయి. తాజాగా ఈ ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. యూపీ విష‌యానికి వ‌స్తే.. అన్ని ఎగ్జిట్‌పోల్ స‌ర్వేలు.. కూడా బీజేపీకే ఇక్క‌డి ప్ర‌జ‌లు ప‌ట్ట‌గ‌డ‌తాయ‌ని తేల్చ‌శాయి. కాంగ్రెస్ మ‌రింత బ‌ల‌హీన ప‌డిన‌ట్టు ఈ ఫ‌లితాల ద్వారా వెల్ల‌డైంది.

యూపీలో.. మొత్తం స్థానాలు 403

పోల్ స్ట్రాట్ స‌ర్వే.. ఏం చెప్పిందంటే..
బీజేపీ + 211-225
సమాజ్‌వాదీ+ 146-160
బీఎస్పీ 14-24 కాంగ్రెస్‌ 4-6

సీఎన్ఎన్‌ న్యూస్‌ 18
బీజేపీ + 240
సమాజ్‌వాదీ+ 140
బీఎస్పీ 17
కాంగ్రెస్‌ -ఇతరులు 6

ఆత్మసాక్షి ఎగ్జిట్‌పోల్‌
బీజేపీ+ 138-140
సమాజ్‌వాదీ+ 235-240
బీఎస్పీ 19-23
కాంగ్రెస్‌ 12-16
ఇతరులు 1-2

పీ-మార్క్‌
బీజేపీ + 225-255
సమాజ్‌వాదీ+ 130-150
బీఎస్పీ 12-22కాంగ్రెస్‌ 2-6
ఇతరులు 0-4

మ్యాట్రిజ్ ఎగ్జిట్‌పోల్‌
బీజేపీ + 262-277
సమాజ్‌వాదీ+ 119-134
బీఎస్పీ 7-15
కాంగ్రెస్‌ 3-8
ఇతరులు 0

This post was last modified on March 7, 2022 11:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏపీలో.. టైం టేబుల్ పాల‌న‌!!

సాధార‌ణంగా ప్ర‌తి ప్ర‌భుత్వం త‌న ప‌ని తాను చేసుకుని పోతుంది. ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్ర‌ణాళిక‌లు.. కొన్ని…

2 hours ago

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

8 hours ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

10 hours ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

11 hours ago

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

13 hours ago

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు…

14 hours ago