Political News

ఏపీ స‌ర్కారుపై మెగా బ్ర‌ద‌ర్ ఫైర్‌

ఏపీ ప్ర‌భుత్వంపైనా.. మంత్రికొడాలి నానిపైనా మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఫైర‌య్యారు. సినిమా పరిశ్రమ విషయంలో ఏపీ ప్రభుత్వం సంకుచిత ధోరణితో ప్రవర్తిస్తోందని తెలిపారు. పవన్‌కల్యాణపై కక్ష సాధించ డం కోసమే ‘భీమ్లానాయక్‌’ రిలీజ్‌ని దృష్టిలో ఉంచుకుని సినిమా టికెట్‌ ధరల పెంపునకు సంబంధించిన జీవో రిలీజ్‌ చేయలేదని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన తాజాగా ఓ వీడియో రిలీజ్‌ చేశారు. ‘మా అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టే దమ్ముందా మీకు’ అంటూ  ఏపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిం చారు. ఇకనైనా.. మంచి పాలన చేయాలని ముఖ్యమంత్రి జగన్‌కు సూచించారు.

“గత కొద్దికాలంగా సినిమా టికెట్ల విషయంలో వైసీపీ ప్రభుత్వం, మంత్రులు విభిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. సినిమా పరిశ్రమలోని కార్యకలాపాలపై వాళ్లకు ఎలాంటి అవగాహన లేదు. కాబట్టి వాళ్లని నేను ఏం అనలేను. సామాన్యుడికీ సినిమా టికెట్‌ ధరలు అందుబాటులోకి రావాలని మీరు అంటున్నారు. దాన్ని నేనూ అంగీకరిస్తా. కానీ, మన సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవాలంటే దాన్ని తెరకెక్కించడంలో కాస్త ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది“ అని నాగ‌బాబు వ్యాఖ్యానించారు.

“నటీనటుల పారితోషికాలు సినిమాకి పెట్టిన ఖర్చులో భాగం కాదని మీరు అంటున్నారు. సినిమాకి పెట్టే మొత్తం ఖర్చులో కేవలం 12 నుంచి 20శాతం మాత్రమే హీరోలకు పారితోషికంగా ఇస్తాం. ఇక్కడ ఒక విషయం మీరు తెలుసుకోవాలి. సినిమా కనుక పరాజయం పొందితే హీరోలు పారితోషికాన్ని తగ్గించుకుం టారు. కొన్నిసార్లు వెనక్కి ఇచ్చేస్తారు. మా అన్నయ్య, పవన్‌, ఎన్టీఆర్‌, మహేశ్‌, ప్రభాస్‌.. ఇలా ఎంతోమంది హీరోలు.. తమ సినిమాలు అనుకున్నంత స్థాయిలో ఆడనప్పుడు నిర్మాతకు బాసటగా ఉండటానికి పారితోషికాన్ని తగ్గించుకున్నవారే.“ అని మెగా బ్ర‌ద‌ర్ వివ‌రించారు.  

రాజ‌కీయ వ్యక్తిగత అజెండాల కారణంగా పవన్‌ని అణగదొక్కేయాలనో, లేదా సినిమా పరిశ్రమలో కొంతమంది హీరోలను ఆర్థికంగా ఇబ్బందులు పెట్టాలనో ప్లాన్‌ చేస్తున్నారు. దాని కోసమే మీరు పరిశ్రమపై పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏ వ్యాపారాన్నైనా మీ చేతుల్లోకే తీసుకుంటున్నారు కదా.. అలాగే సినిమా పరిశ్రమని సైతం ఆంధ్రా వరకూ మీరే తీసుకోండి. వెల్లంపల్లి, కొడాలి వంటి వారిని హీరోలుగా పెట్టి సినిమాలు చేయండి. వాళ్లు బాగా నటిస్తారు. ఆ నటన ముందు మేము ఏ మాత్రం సరిపోం. లేదంటే ఆంధ్రాలో తెలుగు సినిమాలు బ్యాన్‌ చేసేయండి. కొన్నిరోజులు నష్టపోతాం. వేరే దారి చూసుకుని మా సినిమాలు విడుదల చేస్తాం. టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. యూట్యూబ్‌, ఓటీటీ ఎలా చూసుకున్న మాకు డబ్బులు వస్తాయి’’ అని నాగ బాబు ఫైర‌య్యారు. మ‌రి దీనికి వైసీపీ స‌ర్కారు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. 

This post was last modified on February 28, 2022 10:34 pm

Share

Recent Posts

విలక్షణ నటుడి విశ్వరూపం.. నేరుగా థియేటర్లోనే

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…

19 minutes ago

వైష్ణవి చైతన్య బాధ వర్ణనాతీతం

యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకునే అమ్మాయి వంద కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలో భాగం కావడం..…

1 hour ago

మండాడి ఊపులో దేవర ఊసులు

తెలుగులో సముద్రం నేపథ్యంతో వచ్చిన సినిమాలు తక్కువే. తీరప్రాంతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ పూర్తిగా ఈ బ్యాక్ డ్రాప్ లో…

2 hours ago

మహాశక్తి దర్శనం… ఏఐ దీవెనలు

ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…

4 hours ago

బీజేపీ ఎమ్మెల్యే అక్ర‌మాల‌పై నేరుగా మోడీకే ఫిర్యాదు చేసిన ఫ్రెండ్‌!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ బీజేపీ అగ్ర‌నేత‌. ఇక‌, ఆయ‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్‌. తాజాగా మోడీ చిన్న‌నాటి స్నేహితుడు,…

5 hours ago

రామాయణ సంగీతానికి తెర లేచింది

విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…

5 hours ago