పెద్దగా పేరు లేని పార్టీగా ఇవాళ కాంగ్రెస్ ఉండవచ్చు..పెద్ద పెద్ద పదవుల్లో లేని పార్టీగా కూడా ఇవాళ కాంగ్రెస్ ఉండవచ్చు గాక కానీ ఆ పార్టీని అంత సులువుగా తీసేయ్యలేం. అనుకున్నంత సులువగా ఆ పార్టీ ప్రాభవాన్నీ, వైభవాన్నీ చెరిపేయలేం. అందుకే బీజేపీ కూడా కాంగ్రెస్ పార్టీని ప్రధాన ప్రత్యర్థిగానే చూస్తోంది. పైకి చెప్పకున్నా కేసీఆర్,మమత లాంటి ముఖ్యమంత్రులు కూడా బీజేపీ, కాంగ్రెస్ అనే రెండు జాతీయ పార్టీలతో కాకుండా ప్రాంతీయ పార్టీలతోనే కొత్త జట్టును రూపొందించాలని, ఆ విధంగా కట్టుతప్పని స్నేహం ఎన్నికల వరకూ అయినా చేయాలని తలపిస్తున్నారు.అంటే వీళ్లకు కూడా కాంగ్రెస్ శత్రువు అనే కదా! అర్థం.
ముఖ్యంగా కాంగ్రెస్ మ్యానిఫెస్టోలేవీ,బీజేపీకి పోటీ వచ్చే విధంగా ఉన్న మ్యానిఫెస్టోలు అయితే కావు.అయినప్పటికీ కూడా కాంగ్రెస్ అంటే బీజేపీ భయపడుతోంది అన్నది కొంతలో కొంత అయినా అంగీకారానికి నోచుకోదగ్గ విషయమే! అదే విధంగా రాహుల్ మానియా ఇప్పటికిప్పుడు లేకపోయినా యూపీలో ప్రియాంక ప్రయత్నాలు సఫలీకృతం కాకపోయినా ఇవాళ వారి వారి సన్నాహాలను మాత్రం మనం కించపరచకూడదు.
ఆ విధంగా కించపరచడమో, తక్కువ చేసి చూడడమో అన్నది చేయడంలేదు కనుకనే మోడీ తో సహా ఇతర బీజేపీ నాయకులు కాంగ్రెస్ ను అంత సులువుగా తీసుకోవడం లేదు.వారి వారి ప్రయత్నాలను తీసి పడేయడం లేదు. అందుకే నిన్నటివేళ రవిదాస్ జయంతి వేడుకలను రాహుల్ ఎంత సీరియస్ గా తీసుకున్నారో మోడీ కూడా అంతే స్థాయిలో పరిగణించి వెళ్లారు.
ఇవన్నీ కూడా కాంగ్రెస్ కు పోటీగా బీజేపీ ఉంటుంది అనేందుకు ఇదొక తార్కాణం.ఇక రాహుల్ కూడా ఇప్పుడిప్పుడే పరిణితితో కూడిన రాజకీయాలు నడుపుతున్నారు.తనదైన పంథాలో వెళ్తున్నారు.బీజేపీ నుంచి అవమానాలు కూడా భరిస్తున్నారు.అసోం సీఎం అనరాని మాటలు అన్నా కూడా భరిస్తున్నారు. అదేవిధంగా వాటిని తిప్పి కొట్టే ప్రయత్నంలో కూడా హుందాతనం పాటిస్తున్నారు.ఇవే ఇవాళ రాహుల్ కు ప్లస్ కానున్నాయి.
This post was last modified on February 19, 2022 5:24 pm
హారర్ కామెడీ జానర్‌లో ప్రేక్షకులని ఆకట్టుకున్న కాంచన సిరీస్‌లో మరో సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్ దర్శకత్వం…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి ప్రమోటర్స్ కావాలా? పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే.. వ్యూహాలు రచించడంతోపాటు.. ప్రజలకు పార్టీని చేరువ చేసేందుకు ప్రమోటర్ల…
కొత్త సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం కొత్త కాకపోయినా ఇది రెండువైపులా పదునున్న కత్తిలా మారడంతో ఉపయోగాలు ఎన్ని…
మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…
ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ…
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…