ఆంధ్రా,తెలంగాణ అధికారులు కేంద్ర హోం శాఖ నియమించిన త్రి సభ్య కమిటీ సభ్యులతో వర్చువల్ మీటింగ్ లో నిన్నటి వేళ పాల్గొన్నా ఫలితాలేవీ ఆశాజనకంగాలేవు.అనుకున్న సమయానికి అనుకున్న విధంగానే అనుకున్న అజెండాతో మీటింగ్ ప్రారంభం అయినా కూడా అధికారుల స్థాయిలో ఎవరి పంతం వారిదే అన్న విధంగా ఉన్నారు. ఎవరికి వారే తమ మాట నెగ్గించుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.
ఏడేళ్ల కాలంలో కేంద్ర హోంశాఖ చూపని చొరవ సడెన్ గా ఇరు రాష్ట్రాల సీఎస్ లతో మాట్లాడాలని అనుకోవడం నిజంగానే ఆహ్వానించదగ్గ పరిణామమే..! కానీ ఆ అవకాశాన్ని ఆ సావధానతను ఇరు రాష్ట్రాల పెద్దలూ వినియోగించుకోలేకపోయారు అన్నది నిన్నటి వేళ తేలిన నిజం.దీంతో ముఖ్యమయిన విషయాల్లో దేనిపై కూడా క్లారిఫికేషన్ రాలేదు.
ఒక పౌర సరఫరాలకు సంబంధించి ఆ రోజు చేపట్టిన ధాన్యం సేకరణకు సంబంధించి ఏపీకి తెలంగాణ చెల్లించాల్సిన నాలుగు వందల కోట్ల రూపాయల విషయంలో తప్ప! దానిపై కూడా తెలంగాణ తనదైన ట్విస్ట్ ఒకటి ఇచ్చింది. విద్యుత్ బకాయిల విషయమై ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది.
తమపై బకాయిల విషయమై హైకోర్టులో దాఖలు చేసిన కేసు ఉపసంహరించుకోవాలని పట్టుబట్టింది. విద్యుత్ బకాయిల చెల్లింపులపై ఇరు రాష్ట్రాలు తమదైన వింతడ వాదం వినిపించాయే తప్ప సమస్య పరిష్కారంపై పెద్దగా దృష్టి సారించలేదు అన్న వాదన అయితే స్పష్టంగానే వినిపిస్తోంది. అదేవిధంగా ఏపీ నుంచి తమకు రావాల్సిన బకాయిలు ఉన్నాయి అని వాటిపై కూడా దృష్టి సారించాలని పట్టుబడుతోంది తెలంగాణ.ఇంకా కొన్నిఆస్తుల వివాదాలపై కూడా ఏస్పష్టతా ఇవ్వకుండానే నిన్నటి సమావేశం ముగిసింది.
This post was last modified on February 18, 2022 12:35 pm
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…