ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. జాతీయ రాజకీయాల గురించి పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత.. కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం వరుసగా అధికారంలోకి వచ్చింది. దీంతో ఏపీ, తెలంగాణలకు న్యాయబద్ధంగా.. విభజన చట్టం ప్రకారం దక్కాల్సిన లబ్ధి దక్కడం లేదు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా నష్టపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంపై తిరుగుబాటుకు తతెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. బీజేపీయేతర ప్రాంతీయ పార్టీలు, అధికార పార్టీలతో ఆయన కలిసి నడిచేందుకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే చాలా రాష్ట్రాలతో ఆయన మాట్లాడారు.
అయితే.. ఇప్పుడు ఏపీ సీఎం.. జగన్ పరిస్థితి ఏంటి? ఆయన కేసీఆర్‌తో కలిసి వస్తారా? కేంద్రంపై యుద్ధం చేస్తారా? అనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే.. ప్రస్తుతం తెలంగాణ కంటే కూడా.. ఏపీ చాలా నష్టపోతోంది. మోడీ అనుసరిస్తున్న విధానంతో.. ప్రత్యేక హోదా.. అందని మావిగా మారిపోయంది. అదేసమయంలో పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వడం లేదు. విభజన చట్టంలోని అంశాలను కూడా అమలు చేయడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని మోడీ సర్కారుపై కొట్లాడాల్సిన , అవసరమైతే.. మరింత తీవ్రంగా వ్యవహరించాల్సిన అవసరం జగన్‌పై ఉంది. వచ్చే ఎన్నికల్లో ఇది కీలక అంశంగా కూడా మారుతుందనడంలో సందేహం లేదు.
ఈ క్రమంలోనే కేసీఆర్ చూపు.. జగన్ వైపు ఉంది. నిజానికి జగన్‌ను కాదంటే.. మరో ప్రాంతీయ పార్టీగా.. బలమైన టీడీపీ ఉన్నప్పటికీ.. వ్యక్తిగత విషయాలు.. రాజకీయ కారణాలతో ఆయన టీడీపీతో కలిసే పరిస్థితి లేదు. మరోపార్టీ జనసేన ఉన్నప్పటికీ..ఇప్పటికే ఆ పార్టీ.. బీజేపీతో సఖ్యత పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఉన్న ఏకైక ఆశ.. జగన్‌పైనే. ఈ క్రమంలోనే జగన్‌కు పోన్ చేసి వివరించి.. జాతీయ స్థాయిలో కూడగడుతున్న ఐక్యత పై ఆయనను కూడా కలుపుకోవాలని.. కేసీఆర్ భావిస్తున్నారు. అయితే.. జగన్ మాత్రం ఇప్పుడు ఏం చేయాలనే విషయంలో ఏమీ ఆలోచించుకోలేదు. కేంద్రంలో ఉన్న మోడీ అయితే.. తను వెళ్లి మాట్లాడేందుకు అయినా.. అవకాశం ఉంటుంది.
అలా కాకుండా.. రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. తాను నేరుగా వెళ్లి అడిగే పరిస్థితి కానీ, రాష్ట్ర సమస్యలపై చర్చించేందుకు కానీ.. అవకాశం లేదు. ఈ నేపథ్యంలోనే మోడీకి అనుకూలమా ప్రతికూలమా.. అనే విషయాన్ని పక్కన పెడితే.. కాంగ్రెస్‌కు మాత్రం జగన్ తీవ్ర వ్యతిరేకి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మినహా.. ప్రాంతీయ పార్టీలు బలోపేతం అయి.. ఆయా పార్టీల నేతే.. కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే.. జగన్ అటువైపు దృష్టి పెట్టే అవకాశం ఉంది. అదే సమయంలో ఆయనే చెప్పినట్టు కేంద్రంలోని పార్టీకి.. మన రాష్ట్ర ఎంపీల మద్దతు ఉండే పరిస్థితి ఉంటే.. హోదా సాధించవచ్చని.. ఇప్పుడు అది సాకారం చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే.. ఇదంతా కూడా ప్రాంతీయ పార్టీల బలాబలాలపైనే ఆధాపడి ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on February 19, 2022 3:50 pm
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…
ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర నుంచి గ్లామర్ క్వీన్ ఇమేజ్ వైపు శరవేగంగా అడుగులేస్తున్న కథానాయిక కీర్తి సురేష్. దక్షిణాదిన…