ప్రభాస్ కొత్త సినిమా ‘ఆదిపురుష్’ షూటింగ్ పూర్తయిపోవడం చూసి అంతా షాకైపోయారు. ఇంత భారీ చిత్రాన్ని ప్రభాస్ ఇంత వేగంగా పూర్తి చేయడం అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది. ‘రాధేశ్యామ్’ ఆలస్యమైనా.. ‘ఆదిపురుష్’ వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోందని సంతోషించారు ప్రభాస్ ఫ్యాన్స్. ముందు అన్న ప్రకారమే ఆగస్టు 11న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారని ఎగ్జైట్ అయ్యారు.
మార్చి 11కు ‘రాధేశ్యామ్’ ఖరారైన నేపథ్యంలో ఐదు నెలల వ్యవధిలో ప్రభాస్ రెండు సినిమాలతో పలకరించబోతున్నందుకు చాలా సంతోషించారు. తీరా చూస్తే ఇప్పుడు ‘ఆదిపురుష్’ వాయిదా పడటం వారికి నిరాశ కలిగించింది. ఆమిర్ ఖాన్ సినిమా ‘లాల్ సింగ్ చద్దా’ ఏప్రిల్ 14 నుంచి ఆగస్టుకు 11కు వాయిదా పడటంతో దాని కోసమని ‘ఆదిపురుష్’ టీం త్యాగం చేస్తూ తమ సినిమాను వాయిదా వేసుకుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ‘ఆదిపురుష్’ను ఆగస్ట్ రిలీజ్‌కు రెడీ చేయడం కష్టమేమీ కాదు.
కానీ ఆమిర్ ఖాన్ అంతటి వాడు అడిగేసరికి ‘ఆదిపురుష్’ దర్శక నిర్మాతలు తమ చిత్రాన్ని వాయిదా వేసుకోవడానికి ఓకే చెప్పేసినట్లున్నారు. మరి ‘ఆదిపురుష్’ కొత్త డేట్ ఏది అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ చిత్రాన్ని దీపావళి కానుకగా రిలీజ్ చేయాలని డిసైడైనట్లు సమాచారం. రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కాబట్టి దీపావళి పండుగ రోజు సినిమాను రిలీజ్ చేస్తే టైమింగ్ కరెక్ట్‌గా ఉంటుందని అనుకుంటున్నారట.
మామూలుగా హిందీలో, తమిళంలో దీపావళికి భారీ చిత్రాలు రిలీజవుతుంటాయి. తెలుగులో సంక్రాంతి, దసరా పండుగల మీద ఉన్నంత ఆసక్తి దీపావళి మీద ఉండదు. ఐతే ప్రభాస్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీకి దీపావళే కరెక్ట్ టైమింగ్ అని ఫిక్స్ అయ్యారట. బాలీవుడ్లో చాలా ముందుగానే రిలీజ్ డేట్లు ఖరారవుతుంటాయి కాబట్టి ఆలస్యం చేయకుండా తమ సినిమా విడుదల తేదీని ప్రకటించేయాలని ‘ఆదిపురుష్’ టీం చూస్తున్నట్లు సమాచారం.
This post was last modified on February 16, 2022 4:10 pm
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…