వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాకముందు నుంచే వారి కుటుంబంతో పరిచయం ఉందని సినీ నటుడు అలీ చెప్పారు. ఇవాళ సీఎంతో భేటీ తరువాత మీడియాతో మాట్లాడారు. సోమవారం సీఎంవో నుంచి పిలుపు వచ్చిందని.. అతి త్వరలోనే పార్టీ కార్యాలయం నుంచే ప్రకటన ఉంటుందంటూ వ్యాఖ్యానించారు. సినీనటుడు, వైసీపీ నేత అలీ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎంతో భేటీ అయ్యారు. అతి త్వరలో పార్టీ కార్యాలయం నుంచే ప్రకటన ఉంటుందని వ్యాఖ్యానించారు. క్యాంపు కార్యాలయంలో పలువురు మంత్రులను కలిశానని వెల్లడించారు.
ఏమీ ఆశించకుండానే పార్టీలోకి వచ్చానని.. పదవి ఇస్తేనే పార్టీలోకి వచ్చి సేవ చేస్తానని అనలేదని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ సీఎం కాకముందు నుంచే వారి కుటుంబంతో పరిచయం ఉందని చెప్పారు. “2004లో వైఎస్ఆర్ పాదయాత్ర చేసిన తర్వాత కలిశాను. సీఎం జగన్‌తోనూ ముందు నుంచి పరిచయం ఉంది. ఇటీవల మా మ్యారేజ్ డే సందర్భంగా కలవాలని అనుకున్నాం. సీఎంకు అత్యవసర భేటీలు ఉండడం వల్ల కలవలేకపోయాం. సీఎంతో ఫోటో దిగాలని ఉందని నా భార్య ఎప్పటి నుంచో చెబుతోంది. ఇదే విషయం సీఎంతో చెబితే పర్లేదు తీసుకురమ్మన్నారు. గత ఎన్నికల్లో నాకు టికెట్ ఇస్తారని చెప్పడం వాస్తవం. రాజకీయాలకు సమయం కుదరదని నేనే వద్దని చెప్పా. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే క్షేత్రస్థాయిలో పట్టు ఉండాలి. ఒకసారి రాజకీయాల్లోకి వస్తే చిత్రీకరణలు పక్కన పెట్టాలి. సమయం కుదరకే గతంలో టికెట్ ఆఫర్ ఇచ్చినా రాలేకపోయా“ అని వ్యాఖ్యానించారు.
గత సాధారణ ఎన్నికల ముందు వైసీపీలో చేరిన అలీ.. ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ప్రచారం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చాక పదవిని ఆశిస్తోన్న ఆయనకు నిరాశే మిగిలింది. ఇటీవల సినీ ప్రముఖులతో పాటు సీఎం జగన్‌ను అలీ కలిశారు. వారం రోజుల్లో కలుద్దామంటూ అప్పట్లో ఆయనకు సీఎం చెప్పారు. అప్పట్నుంచి అలీకి వైసీపీ తరఫున రాజ్యసభ సీటు ఇస్తారని విస్తృత ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో సీఎంతో అలీ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే పార్టీ కార్యాలయం నుంచే ప్రకటన ఉంటుందంటూ అలీ చేసిన వ్యాఖ్యలు.. ఆసక్తిని రేపుతున్నాయి.
పార్టీ పరగా తాను ఎప్పుడూ ఏమీ ఆశించలేదు అని స్పష్టం చేశారు. పదవుల కోసం వైసీపీలో చేరలేదు అని, పదవుల కోసం పని చేయలేదు అని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడే ఆయనతో తనకు పరిచయం ఉంది అని అన్నారు. తమది చాలా పాత పరిచయం అని, సీఎం జగన్ తోనూ తనకు పరిచయం ఉంది అని తెలిపారు. ఇవాళ మర్యాద పూర్వకంగా మాత్రమే సీఎం ను కలిసినట్లు ఆయన తెలిపారు. అయితే.. త్వరలోనే ప్రకటన ఉందని చెప్పడంతో ఆయనకు రాజ్యసభ సీటు పక్కా అని వైసీపీ వర్గాలు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on February 16, 2022 1:44 pm
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి రెండు పెద్ద సినిమాలు సెట్స్ మీదుంచి వాటిని బ్యాలన్స్ చేయడం ఎంతటి అగ్ర నిర్మాతలకైనా సరే…
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న గాలి భానుప్రకాష్ నాయుడు.. దూకుడు ప్రదర్శిస్తున్నారు. యువ ఎమ్మెల్యేగా…
ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల సమయంలోనూ.. తర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ ప్రశ్న…
ఈ టాపిక్ అల్లు అర్జున్ కోర్టు కేసు, బెయిలు గురించి కాదులెండి. ఆ వ్యవహారం న్యాయస్థానంలో జరుగుతోంది కాబట్టి దాని…
దర్శకుడు, నటుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆయన ఏం మాట్లాడి నా ఆలోచించి.. మాట్లాడతారు.. ఏం…
తెలంగాణ హైకోర్టులో ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మధ్యంతర…