కేంద్రంలోని బీజేపీ, మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు మద్దతు లభిస్తోంది. తాజాగా మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యులర్) జాతీయ అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడ… సీఎం కేసీఆర్ కు తన సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. దేశంలో మత తత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు ముఖ్యమంత్రిని అభినందించా రు. ఈ మేరకు కేసీఆర్కు దేవెగౌడ ఫోన్ చేశారు. `’రావు సాబ్… మీరు అద్భుతంగా పోరాడుతున్నారు. మతతత్వ శక్తుల మీద ఎవరమైనా పోరాటాన్ని కొనసాగించాల్సిందే.
దేశ లౌకికవాద సంస్కృతిని, దేశాన్ని కాపాడుకునేందుకు మేమందరం మీకు అండగా ఉంటాం. మీ యుద్ధాన్ని కొనసాగించండి. మా సంపూర్ణ మద్దతు మీకు ఉంటుంది.’ అని సీఎం కేసీఆర్కు దేవగౌడ తన మద్దతును ప్రకటించారు. తాను త్వరలోనే బెంగళూరుకు వచ్చి సమావేశమవుతానని దేవెగౌడకు సీఎం కేసీఆర్ తెలిపారు. బీ.ఉనీ, కాంగ్రెస్‌లకు ప్రత్యా మ్నాయ కూటమి గురించి గట్టిగా ప్రతిపాదిస్తున్న పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ… కేసీఆర్‌తో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్‌తో ఫోన్లో మాట్లాడారు.
ఈ విషయాన్ని మమత సోమవారం స్వయంగా వెల్లడించారు. విపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఆమె చెప్పారు. దేశ సమాఖ్య స్వరూపం విచ్ఛిన్నానికి గురి కాకుండా తామంతా కలిసి ప్రయత్నిస్తున్నామని తెలిపారు
తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు మాజీ ప్రధానమంత్రి జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ మద్దతు పలికారు. దేశంలో మత తత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారని అభినందించారు. యుద్ధం కొనసాగించాలని కేసీఆర్‌కు సూచించారు. కేసిఆర్ కు ఫోన్ చేసిన దేవెగౌడ దేశ లౌకికవాద సంస్కృతిని కాపాడుకునేందుకు అంతా అండగా వుంటామన్నారు. కేసీఆర్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు.
This post was last modified on February 16, 2022 8:12 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…