ప్ర‌త్యేక హోదా డ్రామాలో విల‌న్లు వీరే?

దేశ రాజ‌ధానిలో ప్ర‌త్యేక హోదా డ్రామాను బీజేపీ న‌డుపుతోంది.తెలంగాణ‌లో కొత్త పార్టీ డ్రామా కేసీఆర్ న‌డుపుతున్నాడు. రాష్ట్రంలో టీడీపీ కూడా మ‌రోడ్రామా న‌డుపుతోంది.అదే హోదా డ్రామా. పాపం కేంద్రం ఇస్తామ‌న్న హోదాను అడ్డుకుంటోంది అని వైసీపీ నుంచి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోంది టీడీపీ. అయినా చ‌ర్చ‌ల అజెండాలో చేర్చి త‌రువాత తొల‌గించిన అంశం హోదానే కావడం వెనుక ఉన్న‌దెవ‌రంటే చంద్ర‌బాబే అని వైసీపీ ఆరోప‌ణ‌లు గుప్పిస్తోంది.

కానీ త‌మ‌కు ఆ అవ‌స‌రం ఎందుకు  ఉంటుంద‌ని టీడీపీ ఘంటాప‌థంగా చెప్ప‌లేక‌పోతోంది కానీ చెప్పే ప్ర‌య‌త్నం అయితే చేస్తుంది. ఆ మాట ఈ మాట క‌లిసి పాపం టీడీపీ లీడ‌ర్ అయిన చంద్ర‌బాబును విల‌న్ చేస్తున్నారు వైసీపీ మ‌నుషులు. కానీ విల‌న్ ఎవ‌రు? ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని తాము భావిస్తున్నామ‌ని  ముందు, లేదు లేదు ఇప్పుడు కాదు ప‌ర‌స్ప‌ర అవ‌గాహ‌నతో కూడిన ఒప్పందం ఇప్పుడు తీసుకురాలేమ‌ని త‌రువాత చెప్పిన పార్టీ బీజేపీ.

కానీ టీడీపీని ఎందుకు వైసీపీ టార్గెట్ చేస్తుందో అర్థం కావ‌డం లేద‌ని సంబంధిత నాయ‌కులు గ‌గ్గోలు పెడుతున్నారు. హోదాపై క‌లిసి పోరాడేందుకు తాము సిద్ధ‌మేన‌ని ఎప్పుడో యువ ఎంపీ రామూ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు. అనేక సంద‌ర్భాల్లో తాను ప్ర‌శ్నించాన‌ని, త‌న‌కు మ‌ద్ద‌తుగా వైసీపీ నిల‌వ‌లేద‌ని వాపోయారు. అలాంట‌ప్పుడు టీడీపీ ఎలా విల‌న్ అవుతుంద‌ని ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు.

ఇక హోదాపై ఇప్ప‌టికిప్పుడు తేల్చ‌లేం అని రామ్ దాస్ అథ‌వాలే అనే కేంద్ర మంత్రి అంటున్నారు. కానీ దీనిపై ఏ స్ప‌ష్ట‌తా ఇవ్వ‌డంలేదు. నెపం ఎప్ప‌టిలానే ఒడిశా,బీహారు రాష్ట్రాల‌పై నెడుతున్నారు. వాళ్ల‌తో పాటు ఇంకొంద‌రు అడుగుతున్నారు అని హోదా విష‌య‌మై దాగుడుమూత‌లు ఆడుతున్నారు కేంద్ర మంత్రి.ఈ ద‌శ‌లో విల‌న్ ఎవరు? హీరో ఎవ‌రు ? హోదా అనే డ్రామా ఉన్నంత కాలం పార్టీల‌కు తిరుగే ఉండ‌దు అన్న‌ది వాస్త‌వం. అటు కాంగ్రెస్ కూడా హోదా ఇస్తాం అని అంటోంది కానీ హోదాపై చ‌ర్చ‌ల్లో ఎందుక‌నో పెద్ద‌గా పాల్గోదు. ఆంధ్రాకు జ‌రిగిన న‌ష్టంపై రాహుల్ గ‌ళం వినిపించ‌డం లేదు.ఇదే స‌మ‌యంలో తెలంగాణ రాష్ట్ర
స‌మితి కూడా హోదాకు స‌హ‌క‌రిస్తాం అనే అంటోంది కానీ పూర్తి స్థాయిలో మ‌న నేత‌ల చొర‌వ లేని కార‌ణంగా గ‌మ్మునుంటోంది.
ఈ ద‌శ‌లో విల‌న్ ఎవ‌రు?