నవ్యాంధ్రప్రదేశ్‌కు ఒక్క రోజులోనే.. చెప్పాలంటే కొన్ని గంటల వ్యవధిలోనే కేంద్రం ఊహించని షాకిచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై చర్చించేందుకు తేదీ, సమయం నిర్ణయించిన కేంద్రం.. ఎజెండాలో తొలుత పెట్టిన ప్రత్యేక హోదా అంశాన్ని తర్వాత తొలగించిందని తెలుస్తోంది. సహజంగానే, ఈ కీలక అంశం తొలగించడంతో ఆంధ్రప్రదేశ్‌లోని జగన్ ప్రభుత్వానికి మింగుడు పడటం లేదని చర్చ జరుగుతోంది.
తెలుగు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉండిపోయిన విభజన సమస్యలపై దృష్టి సారించిన కేంద్ర హోంశాఖ.. ఆ మేరకు ముగ్గురు సభ్యుల కమిటీని నియమించి ఈ నెల 17 న సమావేశం ఏర్పాటుచేసి విభజన సమస్యలపై చర్చించేందుకు ఎజెండా ఖరారు చేసింది. కేంద్ర హోంశాఖ నియమించిన త్రిసభ్య కమిటీకి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అధ్యక్షత వహిస్తారు.
ఇద్దరు సభ్యులుగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారుంటారు. ఈ కమిటీ ప్రతి నెల సమావేశమై సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని హోంశాఖ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. అయితే, ఎజెండాలో తొలుత చేర్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారులకు కబురు అందిందని సమాచారం.
త్రిసభ్య కమిటీలో మొత్తం 9 అంశాలకు గాను ఇప్పుడు చర్చలను 5 అంశాలకే పరిమితం చేసినట్లు సమాచారం. అయితే, ఈ తొలగించిన వాటిలో ప్రత్యేక హోదా ఉండటం సంచలనంగా మారింది. ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చిస్తే తలనొప్పులు వస్తాయని కాబోలు కేంద్రం తాజాగా ఎజెండాలోని ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని వెనక్కి తీసుకున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఈ పరిణామం వైఎస్ జగన్ సర్కారుకు ఇబ్బందిగా మారడం ఖాయమని అంటున్నారు.
This post was last modified on February 13, 2022 8:51 am
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…
అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ).. తాజాగా మరో ఉద్యమానికి తెరదీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…
హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్రమించేవారు కొందరైతే.. తాము చేసిన పనుల కారణంగా చూపిన ధైర్య సాహసాల కారణంగా రాత్రికి…
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…