టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీ నేతలకు నిత్యం క్లాస్ ఇస్తున్నారు. ఏపీ ప్రబుత్వంపై విరుచుకుపడం డి.. ప్రభుత్వం చేస్తున్న పనులను ఎండగట్టండి.. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై ననిలదీయండి.. అని చెబుతున్నారు. అయితే.. పెద్దగా ఎవరూ స్పందించడం లేదు. ఒకవేళ స్పందించినా.. పోలీసులు ఎంట్రీ ఇస్తున్నారు.. ప్రభుత్వం స్పందించేలోగా.. పోలీసులు స్పందిం చేస్తున్నారు. దీంతో నాయకులు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో చంద్రబాబు రూటు మార్చారు.
ఏపీ సర్కారుపై విరుచుకుపడేందుకు.. ప్రజలను చైతన్య పరిచేందుకు ఆయన మేధావుల సాయాన్ని కోరు తున్నారు. మేధావులు ముందుకు రండి! అని చంద్రబాబు తాజాగా పిలుపునిచ్చారు. వాస్తవానికి ఆయన చెబుతున్న విషయాలు.. ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు ప్రజల్లోకి వెళ్లడం లేదని.. చంద్రబాబు భావిస్తు న్నట్టు తెలుస్తోంది. పైగా.. ఆయన ఏం చేసినా.. ఏం చెప్పినా.. మీ హయాంలో ఏం జరిగిందంటూ.. మంత్రు లు కొడాలి నాని, పేర్ని నాని.. వంటి వారు కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో చంద్రబాబు చెబుతున్న వ్యాఖ్యలకు అనుకున్న మైలేజీ రావడం లేదు.
ఇటీవల రెండు రోజుల కిందట రాష్ట్ర విభజన, జగన్ సర్కారు చేస్తున్న తాత్సారం.. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రకటన.. వంటివాటిపై మాజీ ఎంపీ, మేధావి.. ఉండవల్లి అరుణ్‌కుమార్ స్పందించారు. ఇది బాగానే వర్కవుట్ అయింది. మేధావుల నుంచి రాజకీయ ప్రముఖుల వరకు ఉండవల్లి వాదనతో ఏకీభవించారు. దీంతో ఆయనపై ప్రతి విమర్శలు చేయడం కానీ.. కౌంటర్లు ఇవ్వడం కానీ.. కనిపించలేదు. వాస్తవానికి ఉండవల్లి చెప్పిన విషయాల్లో కొన్ని చంద్రబాబు కూడా చెప్పారు. అయినా.. వర్కవుట్ కాలేదు. ఉండవల్లి చెప్పేసరికి అందరూ అలాగా.. ఇలా జరిగిందా? అని బుగ్గలు నొక్కుకున్నారు.
ఈ నేపథ్యంలో మరింత మంది మేధావులు ముందుకు వచ్చి.. మాట్లాడితే.. తప్ప.. జగన్‌పై తను పెట్టుకు న్న టార్గెట్ రీచ్ కాలేనేమోనని చంద్రబాబు భావిస్తున్నట్టుగా ఉన్నారని అంటున్నారు పరిశీలకులు. అం దుకే ఆయన తన పార్టీ నేతలను పక్కన పెట్టి.. మేధావులను ఆశ్రయిస్తున్నారు. మరి బాబు పిలుపుతో ఎంతమంది మేధావులు ముందుకు కదులుతారో చూడాలి.
This post was last modified on February 12, 2022 8:31 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…