Political News

ఏపీకి ప్ర‌త్యేక హోదాను కేంద్రం ప‌రిశీలిస్తోందా?

ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ ను కేంద్రం ప‌రిశీలిస్తోందా? న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ ఏర్ప‌డి ఏడు సంవ‌త్స‌రాలు అయిన‌ప్ప‌టికీ బీజేపీ మిన‌హా ఇత‌ర పార్టీల‌న్నీ చేస్తున్న ప్ర‌ధాన డిమాండ్ల‌లో ఒక‌టైన ఈ అంశాన్ని కేంద్రం సీరియ‌స్‌గా తీసుకుందా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. దీనికి కార‌ణం…రాష్ట్ర విభజన అనంత‌రం పరిష్కారం కాకుండా మిగిలిపోయిన సమస్యలపై కేంద్ర హోంశాఖ త్రిస‌భ్య క‌మిటీ ఏర్పాటు చేయ‌గా అందులో ప్ర‌త్యేక హోదాకు స్థానం క‌ల్పించ‌డం ద్వారా ఈ మేర‌కు కొత్త చ‌ర్చ‌కు చాన్స్ ఇచ్చినట్ల‌యింది. ఈ కమిటీ ప్రతి నెల సమావేశమై సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సి ఉండ‌గా ఈ నెల 17 న కమిటీ తొలి సమావేశం జరగనుంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాలను తొలిగించేందుకు త్రిసభ్య కమిటీని కేంద్ర హోంశాఖ నియమించింది. ఈ కమిటీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శితోపాటు ఇద్దరు సభ్యులుగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారున్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎస్ఎస్ రావత్, తెలంగాణ నుంచి రామకృష్ణారావు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై చర్చించేందుకే త్రి సభ్య కమిటీ అంటూ పేర్కొన్న హోంశాఖ.. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ఎజెండాలో చేర్చడం గ‌మ‌నార్హం.

ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చతోపాటు ఈ కమిటీ సమావేశంలో ముఖ్యంగా ఏపీఎస్ఎఫ్‌సీ విభజన, రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్‌ సమస్యలు, పన్నుల వ్యవహారం, వనరు వ్యత్యాసాలు, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి గ్రాంట్‌పై చర్చించనుంది. తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న సమస్యలలో ప్ర‌త్యేక హోదా ప్ర‌తిపాద‌న‌ ప్ర‌స్తావించ‌డంతో కేంద్రం ఈ అంశాన్ని ప‌రిశీలిస్తుంద‌ని ప‌లువురు అంటున్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటూ గతంలో ప్రకటన చేసిన కేంద్రం.. ప్రస్తుతం హోంశాఖ ఎజెండాలో ప్రత్యేక హోదా విషయాన్ని చేర్చడం కీల‌క‌మైన ప‌రిణామంగా చెప్తున్నారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాలని వైసీపీ ఎంపీలు వరుసగా డిమాండ్ చేస్తుండటంతో పాటు ఇటీవల ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్ కూడా ఇదే విషయాన్ని కేంద్ర పెద్దల ఎదుట ప్రస్తావించారు. తాజా నిర్ణ‌యంతో ముగిసిపోయిందనుకున్న ప్ర‌త్యేక హోదా అంశం మరోసారి తెరమీదకు వచ్చింది.

This post was last modified on February 12, 2022 8:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పిఠాపురం కాదు, మంగళగిరి కాదు, ఏపీలో టాప్ నియోజకవర్గం ఇదే!

ఏపీలో 175 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుక‌బ‌డి ఉన్నాయి. మ‌రికొన్ని మ‌ధ్య‌స్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…

19 minutes ago

తమిళంలో డెబ్యూ హీరో సంచలనం

ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…

3 hours ago

తెలంగాణ నాయకుల జాబితాకు తోడయ్యిన వైఎస్ షర్మిల

కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…

5 hours ago

అసెంబ్లీలో కండోమ్ లతో డెకరేషన్.. ఎప్పుడు..? ఎందుకు..?

ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…

6 hours ago

వికలాంగులతో కేక్ కట్ చేయించిన పవన్

ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…

6 hours ago

‘పవన్ పదవి వదిలి గుడులూ.. గోపురాల చుట్టూ తిరగొచ్చు’

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఆ ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని సీపీఐ సీనియ‌ర్ నేత నారాయ‌ణ డిమాండ్…

7 hours ago