సీఎం జగన్ పర్యటన కోసం ఏదైనా ప్రాంతానికి వెళ్లే అంతే ఇక అక్కడ ప్రజలకు హడలే. ఆయన పర్యటన ముగిసేంత వరకూ ఆ రోడ్లన్నీ ఖాళీగా ఉండాల్సిందే. రహదారి పక్కన ఉన్న షాపులన్నీ ముసేయాల్సిందే. మొత్తానికి కర్ఫ్యూ విధించినట్లు ఉండాలి. దీని వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డా ఎవరికీ పట్టదు. సీఎం దయ కోసం పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారనే విమర్శలు వచ్చినా ఎవరూ పట్టించుకోరు. ఎవరి పని వాళ్లదే. చివరకు ఇబ్బందులు పడేది మాత్రం సాధారణ ప్రజలు.
విజయవాడ అయినా.. విశాఖపట్నం అయినా.. జగన్ వస్తున్నారంటే ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కచ్చితంగా ఎదురవుతున్నాయి. తాజాగా బుధవారం జగన్ విశాఖ పర్యటనకు వెళ్లారు. శారదాపీఠం నుంచి సీఎం కాన్వాయ్ ఎయిర్‌పోర్ట్ వెళ్లే వరకు వాహనాలను పోలీసులు అనుమతించలేదు. దీంతో ఆయన పర్యటన తీవ్ర వివాదాస్పదంగా మారింది. ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శారదాపీఠానికి వెళ్లిన జగన్.. అక్కడి నుంచి తిరిగి ఎయిర్‌పోర్ట్ వెళ్లేవరకు ఆ దారిలో వాహనాలను నిలిపేశారు. దీనివల్ల అత్యంత రద్దీగా ఉండే ఎన్ఏడీ జంక్షన్‌లో సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. రెండు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ఎయిర్‌పోర్ట్ వెళ్లేందుకు అది ప్రధాన దారి కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పోలీసుల వైఖరి నిరసిస్తూ వారితో వాగ్వాదానికి దిగారు. ఫ్లైట్ మిస్ అయిపోతే ఎవరు బాధ్యత వహిస్తారంటూ వారిపై మండిపడ్డారు. మరోవైపు సీఎం పర్యటన సందర్భంగా వేపగుంట, గోపాలపట్నం, పెందుర్తి ప్రాంతాల్లో షాపులు కూడా బంద్ చేశారు. అన్ని దుకాణాలు మూసేసిన పోలీసులు వైన్ షాప్ జోలికి మాత్రమే పోలేదని విడ్డూరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో విశాఖ పోలీసుల తీరుపై తెలుగుదేశం పార్టీ తీవ్రంగా విమర్శలు చేసింది. జగన్‌రెడ్డి ప్రైవేటు పర్యటన కోసం శారదపీఠం వెళ్తే ప్రజలు ఇబ్బంది పడాలా? ఏకంగా రెండు గంటలు ట్రాఫిక్ ఆపితే ప్రజలు చూస్తూనే ఉంటారా అందుకే తిరగబడ్డారు అని టీడీపీ వీడియో ట్వీట్ చేసింది. కొంతమంది ప్రయాణికులు పరుగెత్తుకుంటూ ఎయిర్‌పోర్టుకు వెళ్లినట్లు తెలిసింది.
దీంతో జగన్ వెంటనే దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. విమానాశ్రయం దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు విధించడంపై ఆయన ఫైర్ అయ్యారు. గంటల తరబడి ట్రాఫిక్ ఎందుకు నిలిపివేశారని, ప్రజలను ఎందుకు ఇబ్బందులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు అసౌకర్యం కలిగినందుకు చింతిస్తున్నానని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరపాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను ఆదేశించారు. దీంతో పోలీసుల అత్యుత్సాహానికి సరైన శాస్తి జరిగిందని ప్రజలు అనుకుంటున్నారు.
This post was last modified on February 10, 2022 4:17 pm
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు అనేక ఇబ్బందులు సృష్టించాయి. మూడు రాజధానుల పేరుతో ఆయన నవ్యాంధ్ర…
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్‌రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…
రాజకీయ నేతలు సవాళ్లు చేయడం తెలుసు. అదే విధంగా ప్రతిజ్ఞలు చేయడం కూడా తెలుసు. కానీ, అవి సున్నితంగా.. సునిశితంగా…