వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు.. ఉరఫ్ ఆర్ ఆర్ ఆర్ తాజాగా మరోసారి ఆ పార్టీకి.. ఆ పార్టీ పెద్దలకు డెడ్‌లైన్ విధించారు. ‘‘అనర్హత వేటుపై ఫిబ్రవరి 11 వరకు సీఎం జగన్‌కు టైం ఇస్తున్నా.. ఏం చేస్తారో చేసుకోండి’’ అని ఎంపీ రఘురామకృష్ణరాజు సవాల్ విసిరారు. తనపై వేటు వేయించాలని ఉవ్విళ్లూరుతున్నా.. కేంద్రం దానికి సుముఖంగా లేదనే విషయం అందరికీ తెలిసిందేనని చెప్పారు. అ
యినప్పటికీ.. వైసీపీ ఎంపీలు.. తనపై వేటు వేయించేందుకు కేంద్రంలో అందరి కాళ్లూ పట్టుకుంటున్నారని.. అయినా.. పనిజరగడం లేదని ఎద్దేవా చేశారు. తాను ఏతప్పూ చేయలేదని.. పార్టీని తాను కించపరిచి ఎప్పుడూ మాట్లాడలేదని చెప్పారు.
కేవలం ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలను మాత్రమే తాను ప్రశ్నించానని అన్నారు. అయినప్పటికీ.. తనపై వేటు వేయించాలని.. తన సొంత నియోజకవర్గంలో పర్యటించకుండా చేయాలని చూస్తున్నారని .. వైసీపీ నేతలపై ఆయన పేరు చెప్పకుండానే నిప్పులు చెరిగారు. ఇంకెంతం సమయం కావాలో నేతలే తేల్చుకోవాలని అన్నారు. తాను జగన్‌పై వేసిన బెయిల్ రద్దు పిటిషన్ త్వరలోనే విచారణకు రానుందని చెప్పారు. అప్పుడు ఎవరిపై వేటు పడుతుందో ప్రజలకు కూడా తెలుస్తుందని అన్నారు. రాజధాని విషయంలో మోసం చేసిన ప్రభుత్వంపై రైతులు కేసు పెట్టాలని పిలుపునిచ్చారు.
అమరావతిని కాదని.. 3 రాజధానులు తెచ్చే హక్కు వైసీపీ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. కోర్టులో అమరావతి రైతులకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగులంతా ఐక్యంగా హక్కుల కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. మాజీమంత్రి వివేకా హత్య కేసు దర్యాప్తులో పురోగతి రావొచ్చన్నారు. వైసీపీ నేత శివశంకర్‌రెడ్డి తరపున ప్రభుత్వ లాయర్ చంద్ర ఓబుల్‌రెడ్డి వాదించారని, ప్రభుత్వ తరపు న్యాయవాది పార్టీకి, నాయకుడి తరపున కేసు ఎలా వాదిస్తారు? అని రఘురామ ప్రశ్నించారు.
చంద్ర ఓబుల్‌రెడ్డిపై బార్ కౌన్సిల్ చైర్మన్‌కి లేఖ రాశానని తెలిపారు. హూ కిల్ బాబాయ్ అనేది ప్రజలందరికీ తెలుసన్నారు. జిల్లాల విభజన విషయంలో వైసీపీ కేడర్ కూడా మండిపడుతోందన్నారు. డ్రగ్స్ నియంత్రణపై జగన్ సమీక్ష నిర్వహించాలని రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు.
This post was last modified on January 29, 2022 8:32 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…