Political News

గుడివాడ‌లో అడుగడుగునా.. పోలీసులు…

కృష్ణా జిల్లా గుడివాడ పోలీసుల అష్ట‌దిగ్బంధంలోకి జారిపోయింది. ఎటు చూసినా పోలీసులు క‌నిపిస్తున్నా రు. న‌గ‌రంలో 144 సెక్ష‌న్ కూడా విధించారు. దీనికి కార‌ణం ఏంటి? అంటే.. సంక్రాంతి సంద‌ర్భంగా గుడివా డ‌ను అడ్డాగా చేసుకుని మంత్రి కొడాలి నాని..కేసినో స‌హా ఇత‌ర జూదాలు ఆడించారు. గోవా త‌ర‌హా కేసినో క్రీడ‌ను.. ఆయ‌న త‌న సొంత కె-క‌న్వెన్ష‌న్‌లోనే ఏర్పాటు చేశారు. ఎంట్రీఫీజు రూ.10 వేలుగా నిర్ణయించారు. దీనికి రాష్ట్రం నుంచే కాకుండా.. రాష్ట్రేతర వ్య‌క్తులు కూడా హాజ‌ర‌య్యారు. దీనిపై మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి.

రాష్ట్రాన్ని ఇప్ప‌టికే.. అన్ని ర‌కాలుగా భ్ర‌ష్టుప‌ట్టించారని.. ఇప్పుడు ఏకంగా కేసినో జూద‌కు కూడా రాష్ట్రాన్నిఅడ్డాగా మార్చార‌ని.. టీడీపీ నేత‌లు విమ‌ర్శించాఉ.. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు ఆదేశాల మేర‌కు అస‌లు గుడివాడ‌లో ఏం జ‌రిగింద‌నే విష‌యం తేల్చుకునేందుకు నిజ‌నిర్ధార‌ణ క‌మిటీని వేశారు. టీడీపీ నేతల నిజనిర్ధరణ కమిటీ పర్యటన ప్రారంభ‌మైంది. ఈ నేపథ్యంలో…పట్టణంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు. ఎటు చూసినా.. పోలీసులే క‌నిపి స్తున్నారు. అస‌వ‌ర‌మైతే.. అరెస్టులు కూడా జ‌రిగే అవ‌కాశం ఉందని పోల‌సులు చెబుతున్నారు. మ‌రోవైపు నక్కా ఆనంద్ బాబు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, బొండా ఉమ, ఆలపాటి, తంగిరాల సౌమ్యలతో కూడిన కమిటీ…గుడివాడలో క్యాసినో నిర్వహించిన ప్రాంతాన్ని పరిశీలించనుంది. అనంతరం పూర్తి నివేదికను టీడీపీ అధిష్ఠానానికి ఇవ్వనుంది.

మరోవైపు గుడివాడలో క్యాసినో నిర్వహణపై తెలుగుదేశం నేత బొండా ఉమమ‌హేశ్వ‌ర‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బుల కోసం దిగజారిపోయి క్యాసినో ఆడిస్తారా అని ప్రశ్నించారు. డీజీపీ వైసీపీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. నేటి నిజనిర్ధరణ కమిటీ పర్యటనలో గుడివాడ పరిసర ప్రాంతాల ప్రజల నుంచి వివరాలు తీసుకుంటామన్నారు. డీజీపీ కార్యాలయానికి సమీపంలోనే ఇవన్నీ జరుగుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.

డబ్బుల కోసం దిగజారిపోయి క్యాసినో ఆడిస్తారా. క్యాసినోపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. కొడాలి నానిపై సీఎం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు. డీజీపీ కార్యాలయానికి సమీపంలోనే జరుగుతుంటే పట్టించుకోలేదు. కె కన్వెన్షన్‌లో జరిగినట్లు ఆధారాలతో సహా చూపిస్తాం. తూతూమంత్రంగా విచారణ జరిపితే న్యాయపోరాటం చేస్తాం.. అని ఉమా హెచ్చ‌రించారు. ఈ నేప‌థ్యంలో టీడీపీ గుడివాడ ప‌ర్య‌ట‌న ఏం తేలుస్తుందో చూడాలి.

This post was last modified on January 21, 2022 3:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామాయణం అర‌బిక్ ర‌చ‌యితను అభినందించిన మోడీ!

ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ కువైట్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. 43 ఏళ్ల త‌ర్వాత‌.. భార‌త ప్ర‌ధాని కువైట్‌లో ప‌ర్య‌టించ‌డం ఇదే తొలిసారి. శ‌నివారం…

2 hours ago

మాస్ సినిమా లకు పోటీ ఇవ్వనున్న క్లాస్ మూవీ?

ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…

10 hours ago

సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న.. ఎవరి తప్పు లేదు : అల్లు అర్జున్‌

పుష్ప‌-2 సినిమా ప్రీరిలీజ్ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట‌ అనంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై శ‌నివారం…

13 hours ago

కేజ్రీవాల్ మ‌రోసారి జైలుకేనా?

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌కు మ‌రో ఉచ్చు బిగుస్తోంది. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

14 hours ago

పెళ్లయినా.. కీర్తి తగ్గేదే లే!

కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…

14 hours ago