Movie News

సల్మాన్ సినిమా మునిగినట్లేనా?

బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన సల్మాన్ ఖాన్.. నిఖార్సయిన హిట్టు ఎప్పుడు కొట్టాడో తన వీరాభిమానులు కూడా మరిచిపోయిన పరిస్థితి. దశాబ్దం కిందట వచ్చిన ‘సుల్తాన్’ భారీ విజయాన్నందుకోగా.. ఆ తర్వాత ఆ స్థాయి సక్సెస్ ఆయనకు రాలేదు. టైగర్ జిందా హై లాంటి కొన్ని చిత్రాలకు ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ.. అవి కూడా పూర్తి సంతృప్తిని ఇవ్వలేదు. గత ఏడాది వచ్చిన ‘సికందర్’ సల్మాన్ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఆయన ఆశలన్నీ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ మీదే నిలిచాయి. 

దేశ సరిహద్దుల్లో పరిణామాల నేపథ్యంలో ‘యురి’ సహా కొన్ని చిత్రాలు భారీ విజయాన్నందుకున్న నేపథ్యంలో అదే తరహాలో గాల్వాన్‌లో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన చిన్నపాటి యుద్ధ ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు అపూర్వ లఖియా. కానీ ‘యురి’లా ఇది మ్యాజిక్ చేసే అవకాశం లేదని.. గత ఏడాది టీజర్ లాంచ్ అయినపుడే అర్థమైపోయింది.

టీజర్ కృత్రిమంగా.. వాస్తవ ఘటనను మరీ ఎగ్జాజరేట్ చేసినట్లుగా అనిపించడంతో నెగెటివిటీ తప్పలేదు. సల్మాన్ ఖాన్ లీడ్ క్యారెక్టర్‌కు సూట్ కాలేదనే అభిప్రాయాలు కూడా వినిపించాయి. మరోవైపు ఈ సినిమా మీద చైనా మీడియా ధ్వజమెత్తడం.. చైనా నుంచి బెదిరింపులు కూడా వచ్చాయన్న నేపథ్యంలో ఈ సినిమా టైటిల్‌ను ‘మాతృభూమి’గా మార్చారు. చైనాకు భయపడి టైటిల్ మార్చారనే చర్చతో సినిమా మీద మరింత నెగెటివిటీ ముసురుకుంది. 

ఇవన్నీ పక్కన పెడితే.. సినిమా తీసిన దర్శకుడి ట్రాక్ రికార్డు చూసి సల్మాన్ ఫ్యాన్స్ బెంబేలెత్తిపోతున్నారు. రామ్ చరణ్‌తో ‘జంజీర్’ లాంటి కళాఖండం తీసిన దర్శకుడు అపూర్వ. ఆ తర్వాత కూడా అతడి నుంచి గొప్ప సినిమాలేవీ రాలేదు. ఈ సినిమాను ఈపాటికే రిలీజ్ చేయాల్సింది కానీ.. రీషూట్లు, నెగెటివిటీ కారణంగానే ఆలస్యం అవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఎప్పుడు రిలీజ్ చేసినా.. గొప్ప ఫలితమేమీ రాకపోవచ్చని, ఓపెనింగ్స్ కూడా కష్టమే అని మీడియాలో, సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి సల్మాన్ పరిస్థితి ఏమవుతుందో చూడాలి.

This post was last modified on March 17, 2026 7:09 pm

Share

Recent Posts

ఆ సినిమా శ్రీలీలకే దక్కింది

తెలుగు సినిమాల్లోకి ఒక ఉప్పెనలా దూసుకొచ్చిన హీరోయిన్ శ్రీలీల. ఆమె తెలుగమ్మాయే అయినప్పటికీ కర్ణాటకలో పుట్టి పెరగడం వల్ల అక్కడే…

1 hour ago

స్టార్ సినిమా శ్రీలీలకే దక్కింది

తెలుగు సినిమాల్లోకి ఒక ఉప్పెనలా దూసుకొచ్చిన హీరోయిన్ శ్రీలీల. ఆమె తెలుగమ్మాయే అయినప్పటికీ కర్ణాటకలో పుట్టి పెరగడం వల్ల అక్కడే…

5 hours ago

పెళ్లి కోసం తపించిపోయేవాళ్ళు ఇంతమంది ఉన్నారా?

నాకు పెళ్ళెప్పుడవుతుంది బాబూ ... పిల్ల యాడ దొరుకుతుంది బాబోయ్ అనే సినిమా పాట పాడుకుంటున్నారు కేరళం యువకులు. అత్యధిక…

6 hours ago

రష్మిక తాండవం ఊహించలేదు

ర‌ష్మిక మంద‌న్నా కెరీర్లో ఎక్కువ‌గా స్టార్ హీరోల స‌ర‌స‌న క‌థానాయిక‌గానే న‌టించింది. ఈ మ‌ధ్యే ఆమె కూడా లేడీ ఓరియెంటెడ్…

6 hours ago

హైదరాబాద్ గడ్డపై విరుచుకుపడ్డ అమిత్ షా

తెలంగాణ‌లో ప‌ర్య‌టన‌కు వ‌చ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్ర‌నాయ‌కుడు అమిత్‌షా.. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కీల‌క…

6 hours ago

ఏపీలో మునిసిప‌ల్ పోలింగ్ ఎందుకు త‌గ్గింది… రీజ‌నేంటి?

ఏ ఇద్ద‌రు నేత‌లు క‌లిసినా.. ఏ ఇద్ద‌రు నాయ‌కులు ఫోన్లు చేసుకున్నా.. ఇదే అంశంపై చ‌ర్చ సాగుతోంది. ఏపీలో తాజాగా…

6 hours ago