Political News

క‌మెడియ‌న్ స్టార్‌కి ఈసారి వైసీపీ సీటు గ్యారెంటీనా..!

సినిమాల‌కు, రాజ‌కీయాల‌కు మ‌ధ్య అవినాభావ సంబంధం ఉన్న విష‌యం తెలిసిందే. అనేక మంది స్టార్లు.. వివిధ పార్టీల త‌ర‌ఫున గ‌ళం వినిపించిన విష‌యం తెలిసిందే. ఇలాంటి వారిలో స్టార్ క‌మెడియ‌న్‌.. ఆలీ ఒక‌రు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. వైసీపీ తీర్థం పుచ్చుకున్న ఈయ‌న టికెట్ ఆశించార‌ని అంద‌రూ అనుకున్నారు. అంతేకాదు.. వాస్త‌వానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే.. త‌న‌కు అభిమానమ‌ని ప‌దే ప‌దే చెప్పిన ఆయ‌న జ‌న‌సేన తీర్థం పుచ్చుకుంటార‌ని అనుకున్న స‌మ‌యంలో అనూహ్యంగా వైసీపీ త‌ర‌ఫున ఎన్నిక‌ల ప్ర‌చారం కూడా చేశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు జ‌గ‌న్ టికెట్ ఇస్తార‌ని అంద‌రూ భావించారు.

అయితే.. ఆ ఎన్నిక‌ల్లో ఆలీకి అవ‌కాశం ద‌క్క‌లేదు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న ప్ర‌చారం నిర్వ‌హించారు.
రాజ‌మండ్రి స‌హా గుంటూరులోనూ.. ఆలీని ప్ర‌చారానికి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ వినియోగించుకుంది. జ‌గ‌న్ అంటే.. ఎంతో ఆత్మీయత క‌న‌బ‌ర‌చ‌డంతోపాటు.. వైసీపీపై అనేక మంది స్టార్ న‌టులు.. విమ‌ర్శ‌లు చేసిన స‌మ‌యంలోనూ.. ఆలీ మౌనంగా ఉండ‌డం విశేషం. అంతేకాదు.. ఏపీపై కొంద‌రు ప్ర‌ముఖ న‌టులు.. ఇటీవ‌ల కాలంలో టికెట్ ధ‌ర‌లు, ధియేట‌ర్ల‌పై దాడులు వంటి విషయాల్లో విమ‌ర్శ‌లు చేసినా.. ఆలీ మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌లేదు.

ఈ క్ర‌మంలో ఆయ‌న వైసీపీ అభిమాని అనే చ‌ర్చ అటు టాలీవుడ్‌లోనూ సాగింది. ఇక‌, ఇప్పుడు ఆయ‌న‌కు టికెట్ ఇస్తార‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు.  గ‌త ఎన్నిక‌ల్లో మిస్స‌యినా.. ఇప్పుడు మాత్రం.. ఖ‌చ్చితంగా టికెట్ ల‌భిస్తుంద‌ని చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌లు కీల‌కం కావ‌డంతో ఆలీ వంటి ప్ర‌జాద‌ర‌ణ ఉన్న యాక్ట‌ర్‌ను రంగంలోకి దింపితే.. గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయ‌మ‌నే సంకేతాలు కూడా వ‌స్తున్నాయి. అయితే.. ఆలీ కోరుకుంటున్న‌ది.. గుంటూరు జిల్లాలోని ఒక కీల‌క నియోజ‌క‌వ‌ర్గం. కానీ, ఇప్ప‌టికే ఇక్క‌డ కీల‌క నేత ఒక‌రు ఉన్నారు. ఆయ‌న కూడా పార్టీకి వీరాభిమాని. దీంతో ఇక్క‌డ టికెట్ ఇచ్చే అవ‌కాశం లేదు.

ఈ క్ర‌మంలో రాజ‌మండ్రి సిటీ నియోజ‌వ‌క‌ర్గం ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైసీపీ ఓడిపోయింది. అప్ప‌టి ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున రౌతు సూర్య‌ప్ర‌కాశ‌రావు పోటీ చేశారు. అయితే.. ఆయ‌న టీడీపీ ముందు.. జోరు చూపించ‌లేక పోయారు. పైగా ఇప్ప‌టికీ.. ఆయ‌న యాక్టివ్ కాలేక పోతున్నార‌నే వాద‌న పార్టీలో వినిపిస్తోంది. ఈ క్ర‌మంలో ఇక్క‌డ నుంచి ఆలీ వంటి కీల‌క వ్య‌క్తికి అవ‌కాశం ఇస్తే.. టీడీపీని ఓడించ‌డం ఖాయ‌మ‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆలీకి రాజ‌మండ్రి సిటీ టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉంద‌ని.. వైసీపీ నేత‌ల మ‌ధ్య చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on January 19, 2022 6:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అల్లు అర్జున్ కు మరోసారి లీగల్ నోటీసులు!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…

20 minutes ago

అవసరమైతే విదేశీ డాక్టర్లతో రేవతి కుమారుడు శ్రీతేజ్ కు వైద్యం!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…

30 minutes ago

కరోనా వేళ ప్రభాస్‌తో డైరెక్టర్ శంకర్ చర్చలు!

తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…

2 hours ago

పార్ట్ 2 మంత్రం పని చేయలేనట్టేనా…?

విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…

3 hours ago

వైల్డ్ ఫైర్ ఎఫెక్ట్ : ఆంధ్ర వైపు సంక్రాంతి సినిమాల చూపు!

పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…

3 hours ago

ఉదయం 4 గంటలకు డాకు మహారాజ్ షోలు : సాధ్యమేనా?

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…

4 hours ago