తొందరలో ఖాళీ అవబోతున్న నాలుగు రాజ్యసభ స్ధానాల్లో వైసీపీ తరపున ఎవరికి అవకాశం వస్తుందనే విషయంలో పార్టీలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. రేపు జూన్ మాసంతో ఏపీలోని నలుగురు ఎంపీలు రిటైర్ అవుతారు. విజయసాయిరెడ్డి, సుజనాచౌదరి, టీజీ వెంకటేష్, సురేష్ ప్రభు పదవీకాలం ముగిసిపోతుంది. వీరిలో విజయసాయి వైసీపీ తరపున ఇఫ్పటికే రాజ్యసభలో ఎంపీగా ఉన్నారు. సుజనా, టీజీ వెంకటేష్, సురేష్ ముగ్గురు టీడీపీ కోటాలో రాజ్యసభకు ఎంపికయ్యారు.
వీరి ముగ్గురిలో సుజనా, టీజీ ఇద్దరు టీడీపీ నేతలైతే 2016 నాటి పరిస్ధితుల కారణంగా బీజేపీ నేతైన సురేష్ ప్రభును ఏపి నుంచి టీడీపీ కోటాలో రాజ్యసభకు నామినేట్ చేయాల్సొచ్చింది. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి తర్వాత సుజనా, టీజీ కూడా టీడీపీలో నుంచి బీజేపీలోకి ఫిరాయించారు. సరే ఏ విషయం ఎలాగున్నా పై నలుగురి పదవీకాలం ముగిసిపోతోంది. వీరిలో విజయసాయికి మళ్ళీ రెన్యువల్ వస్తుందనే అనుకుంటున్నారు.
ఇపుడున్న ఆరుగురిలో పరిమళ్ నత్వానీ కాకుండా ముగ్గురు రెడ్లు, ఇద్దరు బీసీలున్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారమైతే ఈసారి బీసీలకు అవకాశం ఉండదట. ఎందుకంటే ఇప్పటికే బీసీ కోటాలో మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉన్నారు. కాబట్టి భర్తీ చేయబోయే మిగిలిన మూడు సీట్లలో ఒకటి కాపులకు, ఇంకోటి మహిళకు మరోటి ఎస్సీలకు కేటాయించే అవకాశం ఉందని సమాచారం. ఈ మూడు వర్గాలను కూడా మూడు ప్రాంతాల నుండి ఎంపిక చేసే అవకాశం ఉందంటున్నారు.
కాపులు, మహిళలు, మైనారిటిల కోటాలో భర్తీ చేయబోయే నేతల పేర్లను జగన్మోహన్ రెడ్డి పరిశీలిస్తున్నట్లు సమాచారం. తిరుగుబాటు ఎంపీ రఘురామరాజు రాజీనామా చేస్తే ఉపఎన్నిక వస్తుంది. నరసాపురం పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజవర్గాల్లో రాజులు, కాపుల ప్రాబల్యం చాలా ఎక్కువ. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే కాపులకు ప్రాతినిధ్యం విషయాన్ని పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. మొదటి నుండి కూడా జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గాలను బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇపుడు కూడా అదే పద్దతి పాటించనున్నారు.
This post was last modified on January 17, 2022 12:08 pm
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…
ఏపీలో కూటమి సర్కారు అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం రికార్డ్ సృష్టించింది. గత ఏడాది ప్రారంభించిన ఈ పథకం…
అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…
ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…
ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం…