సుప్రీంకోర్టు లాయర్లకే బెదిరింపు కాల్సు వస్తుండటం సంచలనంగా మారింది. ఖలిస్తాన్ అనుకూల సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ నుండి తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు చాలామంది లాయర్లు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లడం కలకలం రేపుతోంది. పంజాబ్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాన్వాయ్ ను కొందరు ఆందోళనకారులు అడ్డుకోవటం భద్రతా వైఫల్యమే అని తేలిపోయింది. అయితే లోపానికి కారణం ఏమిటి ? బాధ్యులెవరు ? అనే విషయమై దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఒక కమిటీ వేశారు.
భద్రతా లోపాలపై లోతుగా విచారణ జరపాలని లాయర్స్ వాయిస్ అనే సంస్థ వేసిన కేసుతో సుప్రీంకోర్టు విచారణను స్వీకరించింది. అయితే భద్రతా లోపాలపై జరిగే విచారణలో సుప్రీంకోర్టు లాయర్లు ఎవరు పాల్గొనేందుకు లేదంటు కొందరికి ఫోన్లు రావడం ఆశ్చర్యంగా ఉంది. తమకు వచ్చిన బెదిరింపు కాల్సన్నీ లండన్ నుండి వచ్చినట్లు లాయర్లు చెబుతున్నారు. ఖలిస్థాన్ ఉద్యమ సంస్ధకు లండన్, కెనడా దేశాల నుంచి భారీ ఎత్తున నిధులు అందుతున్నాయనే ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి.
దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీని బలి తీసుకున్నది కూడా ఖలిస్తాన్ ప్రేరేపిత పోలీసులే అన్న ప్రచారం అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి ఖలిస్థాన్ సంస్ధను, దాని ఉద్యమాన్ని అణిచివేసేందుకు కేంద్రానికి చాలా సంవత్సరాలు పట్టింది. అయితే మళ్ళీ ఖలిస్థాన్ సంస్థ కార్యకలాపాలు మొదలయ్యాయి. మొన్నటి నరేంద్ర మోడీ కాన్వాయ్ ను అడ్డుకున్నది కూడా ఖలిస్థాన్ ప్రేరేపిత ఆందోళనకారులే అని తెలుస్తోంది. లాయర్లను బెదిరిస్తున్నది కూడా ఖలిస్థాన్ సంస్థ నుండి వచ్చిన ఫోన్ కాల్సే అని లాయర్లు చెబుతున్నారు.
ఏదేమైనా ప్రధానమంత్రి కాన్వాయ్ ను అడ్డుకున్నది ఆందోళనకారులే అని పైకి కనిసిస్తున్నా లోపల మాత్రం పెద్ద విషయమే ఉందని అర్ధమవుతోంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం కూడా మరోటుంది. అదేమిటంటే ఫ్లైఓవర్ పైన ఆందోళనకారులు వాహనాలు అడ్డుంచింది మామూలుగా నిరసన తెలుపడానికి మాత్రమే. తాము వెహికల్స్ ఉంచిన ఫ్లైఓవర్ పైనే ప్రధానమంత్రి ప్రయాణించబోతున్నట్లు ఆందోళనకారులకు అప్పుడు తెలీదు.
ఏదేమైనా ప్రధాని కాన్వాయ్ ప్రయాణించే విషయంలో తలెత్తిన భద్రతా లోపాలు చిన్న విషయమైతే కాదు. భవిష్యత్తులో ఇలాంటి వైఫల్యం మరోసారి తలెత్తకూడదంటే ఇపుడు సమస్యపై లోతుగా దర్యాప్తు జరగాల్సిందే. ప్రధానమంత్రిగా ఎవరున్నారు ? పంజాబ్ లో అధికారంలో ఉన్న పార్టీ ఏదన్న విషయం అప్రస్తుతం. వ్యక్తుల కన్నా వ్యవస్ధే కీలకమన్న పద్దతిలోనే దర్యాప్తు జరిపి లోపాల సవరణకు సుప్రీంకోర్టు సూచనలు చేస్తే బాగుంటుంది.
This post was last modified on January 11, 2022 5:27 pm
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై ఈసారి చాలా ఆసక్తిగా మారబోతోన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి దుబాయ్, పాకిస్థాన్ వేదికలుగా…
తీవ్ర వివాదాలు ఎదురుకుంటూ విపరీతమైన వాయిదాలకు లోనవుతూ వచ్చిన ఎమర్జెన్సీ ఇటీవలే విడుదలయ్యింది. క్రిష్ వదిలేశాక మణికర్ణిక బ్యాలన్స్ పూర్తి…
కరోనా తర్వాత థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిన మాట వాస్తవం. కొవిడ్ టైంలో ఓటీటీలకు బాగా అలవాటు పడ్డాక..…
ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీకి ఫౌజీ టైటిల్…
టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమాలకు కాస్తంత గ్యాప్ ఇచ్చినట్టే కనిపిస్తున్నారు. ఈ సంక్రాంతికి డాకు…