సినిమాల విషయంలో ఒకప్పుడు జనాలు ఎంతో ఉదారంగా ఉండేవాళ్లు. సినిమాను సినిమాలాగే చూసేవారు. నిజంగా అభ్యంతరకంగా ఉన్న విషయాల మీద కూడా పెద్దగా వివాదాలు రాజేసేవారు కాదు. కానీ ఇప్పుడు జనాలు మరీ సున్నితంగా తయారైపోయి.. ప్రతి చిన్న విషయం మీదా రాద్దాంతం చేస్తున్నారన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. మీడియా, సోషల్ మీడియా ప్రతిదాన్నీ బూతద్దంలో చూపించి చిన్న వివాదాల్ని ఇంకా పెద్దవి చేస్తున్న సంగతి తెలిసిందే.
సినిమా పాటల్లో వాడిన ఒక చిన్న పదం గురించి కూడా వివాదాలు తలెత్తిన సందర్భాలు చూస్తూనే ఉన్నాం. ఫిలిం మేకర్స్‌కు నిజానికి ఏ ఉద్దేశం లేకపోయినా.. ఏదో ఒక ఉద్దేశాన్ని ఆపేదిస్తున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇలాంటి వివాదమే ఇప్పుడు పుష్ప సినిమా విషయంలో తలెత్తింది. ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీకి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న రవిచంద్రా రెడ్డి.. పుష్ప సినిమాకు సంబంధించి చిత్రమైన విషయాన్ని లేవనెత్తారు.
ఇందులో విలన్లు, చెడ్డ పనులు చేసేవాళ్లందరి పేర్లూ రెడ్లే అని.. పుష్ప నిర్మాత అయిన రవిశంకర్ కమ్మ కులస్థుడు కావడంతో ఉద్దేశపూర్వకంగా రెడ్లను కించపరిచేలా ఇందులో విలన్ పాత్రధారుల్ని రెడ్లుగా చూపించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐతే నిజంగా ఈ ఉద్దేశంతో నిర్మాతలు విలన్ల పేర్లు రెడ్లుగా పెట్టాలని నిర్మాతలు సూచిస్తే సుకుమార్ పెట్టి ఉంటాడా అన్నది ప్రశ్న. సినిమాలో కొండారెడ్డి, అతడి ఫ్యామిలీ స్మగ్లింగ్ చేస్తున్నట్లు చూపిస్తారు.
ఒకే కుటుంబానికి చెందిన వాళ్లను చూపించినపుడు వాళ్లందరూ రెడ్లే అయ్యుంటారు. మరి మెయిన్ విలన్ అయిన మంగళం శీను రెడ్డి కాదు కదా? రాయలసీమలో బేసిగ్గా రెడ్లు ఎక్కువ. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో రెడ్డి కులస్థలు కీలకంగా ఉన్న మాటా వాస్తవం. ఎర్రచందనం స్మగ్లర్స్ అని గూగుల్లో కొడితే ప్రధానంగా కొందరు రెడ్ల పేర్లు వస్తాయన్నదీ వాస్తవం. అయినా సమరసింహారెడ్డి, ఇంద్రసేనా రెడ్డి అని హీరోలకు రెడ్ల పేర్లు పెట్టి సినిమాలు తీస్తే రాని అభ్యంతరం.. విలన్లకు రెడ్ల పేర్లు పెడితే రావడమే విడ్డూరం. ఇలా ప్రతిదానికీ అభ్యంతర పెడితే సినిమా వాళ్లు ఏం రాస్తారు.. ఏం తీస్తారు?
This post was last modified on January 11, 2022 7:35 am
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…