Political News

చంద్రబాబుకు జనసేన చాలెంజ్

ఒకవైపు జనసేనతో పొత్తుకు చంద్రబాబునాయుడు లవ్ ప్రపోజల్ పంపితే రిటర్న్ లో జనసేన చంద్రబాబునాయుడుకు షరతులు విధిస్తున్నది. జనసేన సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రిగా ప్రకటించే దమ్ము చంద్రబాబుకుందా అంటు చాలెంజ్ చేశారు. 2014లో రాష్ట్రం కోసం పవన్ భేషరతుగా చంద్రబాబుకు మద్దతిచ్చి ముఖ్యమంత్రిని చేసిన విషయాన్ని బొలిశెట్టి గుర్తుచేశారు.

రాబోయే ఎన్నికల్లో భేషరతుగా పవన్ కు మద్దతిచ్చి ముఖ్యమంత్రిని చేస్తారా అంటు చంద్రబాబును బొలిశెట్టి నిలదీశారు. చంద్రబాబును ఒకవైపు బొలిశెట్టి చాలెంజ్ చేస్తునే మరోవైపు ఆరోపణలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డితో పాటు చంద్రబాబు కూడా రాష్ట్ర ద్రోహే అంటు ఆరోపించారు. జగన్ను ఎలాగైనా గద్దె దింపాల్సిన అవసరం చంద్రబాబుకే కానీ తమకు లేదని స్పష్టంచేశారు.

అవినీతి టీడీపీ, అరాచక వైసీపీ నుండి రాష్ట్రానికి విముక్తి కావాలంటే జనాలే జనసేనపార్టీని గెలిపించుకుని పవన్ను ముఖ్యమంత్రిని చేస్తారనే ధీమాను వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్యంలో కావాల్సింది జనాల మద్దతే కానీ పార్టీల మద్దతు కాదని గట్టిగానే చురకలంటించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అఖిలపక్ష సమావేసం నిర్వహించటం లేదని జగన్ ప్రభుత్వంపై మండిపోయారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం చేసినట్లుగానే ఇపుడు జగన్ ప్రభుత్వం కూడా చేస్తోందన్నారు.

చంద్రబాబు విషయంలో బొలిశెట్టి ఆరోపణలు, వ్యాఖ్యలు, విమర్శలు చూస్తుంటే పవన్ కు తెలీకుండా జరిగిందని అనుకునేందుకు లేదు. ఒకవైపు జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తునే గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన విషయాలను బొలిశెట్టి తవ్వి తీయటం చూస్తే ఉద్దేశ్యపూర్వకంగానే చేసినట్లుంది. పవన్ కు తెలీకుండా చంద్రబాబుపై  బొలిశెట్టి ఇంత ఘాటుగా ఆరోపణలు, వ్యాఖ్యలు చేసే అవకాశం లేనేలేదు. బొలిశెట్టి చాలెంజ్ పై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.

This post was last modified on January 10, 2022 12:03 pm

Share

Recent Posts

నరసింహా సీక్వెల్… నమ్మొచ్చా

సౌత్ ఇండియన్ సినిమాలో సీక్వెల్, ఫ్రాంఛైజీల సక్సెస్ రేట్ తక్కువ అయినప్పటికీ.. అప్పుడప్పుడూ ఓ చిత్రం పెద్ద హిట్టయి ఆ…

1 hour ago

ఫ్యాక్షన్ గొడవలకు దిగొద్దు అంటున్న జేసీ

రాయలసీమకు సాహిత్య, సాంస్కృతిక చరిత్ర వుంది. సినిమా వాళ్ళు, కొందరు రాజకీయ నాయకుల పుణ్యమాని ఫ్యాక్షన్ ప్రాంతంగా పేరు పడిపోయింది.…

2 hours ago

రణబాలి అసలు యుద్ధం రేపటి నుంచి

దసరా సెలవులు రణబాలికి చాలా ప్లస్ అయ్యాయి. రిలీజ్ రోజు ప్రాథమికంగా వచ్చిన పబ్లిక్ టాక్, సోషల్ మీడియా రెస్పాన్స్…

3 hours ago

నాగార్జున పదే పదే హెచ్చరిస్తున్నా

రిలీజ్ డేట్ల వాయిదాల గురించి నాగార్జున కొన్ని నెలలుగా సందర్భం దొరికినప్పుడంతా తన స్వరం వినిపిస్తూనే ఉన్నారు. లెనిన్ నుంచి…

4 hours ago

కళ్యాణం ఎందుకు క్రేజీ కాలేదు

దసరాని లక్ష్యంగా పెట్టుకుని విడుదలైన అయిదు సినిమాల్లో నాలుగు తమ టార్గెట్ ని దాదాపుగా అందుకునే పనిలో ఉండగా ఒకటి…

5 hours ago

చాప కింద నీరులా 100 కోట్లు కొల్లగొట్టింది

ఒక చిన్న సినిమా. కేవలం రెండున్నర కోట్ల బడ్జెట్ లో తీశారు. షూటింగ్ చివరి దశలో డబ్బులు అయిపోతే దర్శకుడు…

6 hours ago