దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. వైఖరిపై కొన్నాళ్లుగా విమర్శలు చేస్తున్న.. మేఘాలయ గవర్నర్.. బీజేపీ నాయకుడు సత్యపాల్ మాలిక్ తాజాగా మరోసారి విరుచుకుపడ్డారు. “ప్రధాని మోడీ చాలా అహంకారి“ అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. మూడు వ్యవసాయ చట్టాలు వ్యతిరేకంగా రైతులు చేసిన ఆందోళనలను నిలువరించే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పులు, తర్వాత.. కకేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు కారు నడిపిన కారణంగా రైతులు చనిపోయిన ఘటనలపై మోడీ తీవ్రంగా స్పందించారని ఆయన వ్యాఖ్యానించారు.
“రైతులేమన్నా.. నా కోసం చచ్చిపోయారా? “ అని మోడీ పరుషంగా ప్రశ్నించినట్టు మాలిక్ తెలిపారు. “రైతుల సమస్యల పరిష్కారం కోసం.. నేను ప్రధానిని కలిశాను. ఐదు నిమిషాల పాటు మా ఇద్దరి మధ్య వాగ్యుద్ధం జరిగింది. రైతుల ఉద్యమంలో వివిధ కారణాలతో దాదాపు 500 మంది రైతులు చనిపోయారు. అని నేను అన్నప్పుడు.. ప్రధాని తీవ్రంగా స్పందించారు.
ఏమాత్రం మానవత్వం లేకుండా మాట్లాడారు. `నాకోసం చచ్చిపోయారా? ` అంటూ.. ప్రశ్నించారు. అంతేకాదు.. రైతులకు తిండి ఎక్కువైంది. అందుకే చచ్చిపోయారు! అని వ్యాఖ్యానించారు. ఇంకా నేను ఏదో మాట్లాడుతుంటే.. ఇంక నాకేమీ చెప్పొద్దు.. ఏదైనా ఉంటే.. అమిత్ షాతో చెప్పుకోండి!“ అని బయటకు పంపేశారు. “ అని మాలిక్ వెల్లడించారు.
హరియాణాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ సత్యపాల్ మాలిక్.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల తాలూకు వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండడం గమనార్హం. అయితే.. మాలిక్ వ్యాఖ్యలపై పలువురు మిశ్రమ స్పందన వచ్చింది. గతంలోనూ ఆయన ఇలానే చేశారని.. ఇప్పుడు మరోసారి గవర్నర్ పదవిని పొడిగించుకునేందుకు ఇలాచేస్తున్నారని పేర్కొనడం గమనార్హం.
This post was last modified on January 3, 2022 9:56 pm
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…