Political News

మోడీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నారా ?

నరేంద్ర మోడీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నారా ? అవుననే అనిపిస్తోంది క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే. అప్పుడు మూడు వ్యవసాయ చట్టాలకు చేసిన తప్పునే ఇపుడు అమ్మాయిల వివాహ వయస్సు విషయంలో కూడా చేస్తున్నారు. ముందుగా నిర్ణయం తీసేసుకోవటం తర్వాత వివాదం రేగగానే దానిపై అద్యయనానికి కమిటి వేయటం మోడీ ప్రభుత్వానికి ఇది రెండోసారి. పైగా ఇపుడు నియమించిన కమిటిలో కేవలం ఒకే ఒక్క  మహిళా ఎంపిని నియమించటం మరిన్ని వివాదాలకు కారణమవుతోంది.

అమ్మాయిల వివాహ వయస్సు 18 ఏళ్ళ నుండి 21 సంవత్సరాలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వెంటనే దీనిపై వివాదం మొదలైంది. సరే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా వ్యతిరేకించే ప్రతిపక్షాలు, జనాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. ఇపుడు కూడా ప్రతిపక్షాలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. వివాదం బాగా పెద్దదవుతున్న నేపధ్యంలో బిల్లును సమగ్రంగా చర్చించేందుకు, పరిశీలించేందుకు పార్లమెంట్ స్ధాయి సంఘాన్ని కేంద్రం నియమించింది.

31 మంది ఎంపీలతో కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీలో కేవలం ఒకే ఒక్క మహిళా ఎంపీ ఉండటం వివాదానికి కారణమవుతోంది. అమ్మాయిల వివాహ వయస్సును నిర్ణయించే  కమిటీలో   ఎక్కువ మంది మహిళా ఎంపీలను నియమించకుండా పురుషులనే నియమించటం ఏమిటంటు మిగిలిన మహిళా ఎంపీలు మోడిపై మండిపోతున్నారు. అమ్మాయిల వివాహ వయసు ఎంతుండాలనే విషయాన్ని చర్చించాల్సింది మహిళలే కానీ పురుషులు కాదు కదా అంటు రాజ్యసభ ఎంపీ జయాబచ్చన్ వాదన మొదలుపెట్టారు.

జయ వాదనకు మిగిలిన పార్టీల్లోని మహా ఎంపీల నుంచి మద్దతు పెరుగుతోంది. మహిళా సమస్యలను చర్చించే కమిటీలో పురుషుల మెజారిటీ ఏమిటంటు చాలామంది లా పాయింట్లు లాగుతున్నారు. వాళ్ళ పాయింట్ కూడా కరెక్టే. మరి కమిటిని నియమించే ముందు కేంద్ర ప్రభుత్వం ఇంత చిన్న విషయాన్ని ఎందుకు ఆలోచించలేదో అర్ధం కావటం లేదు. అమ్మాయిల వివాహ వయస్సు ఎంతుండాలని పరిశీలించే 31 మంది సభ్యుల  కమిటిలో కనీసం సగంమంది మహిళా ఎంపీలుండాల్సిందే అనే డిమాండ్లు పెరిగిపోతున్నాయి. ముందు నిర్ణయం తీసుకోవటం తర్వాత తీరిగ్గా కమిటీలు వేయటం మోడీ సర్కార్ కు అలవాటైపోయింది. 

This post was last modified on January 3, 2022 10:26 am

Share

Recent Posts

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

2 hours ago

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

5 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

7 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

8 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

8 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

9 hours ago