మంత్రి కొడాలి నాని బీజేపీకి చాలా పెద్ద సవాలే విసిరారు. మంత్రి విసిరిన ఛాలెంజ్ అలాంటిలాంటి చాలెంజ్ కాదు. వచ్చే ఎన్నికల్లో కనీసం 10 నుంచి 20 సీట్లలో బీజేపీ డిపాజిట్లు తెచ్చుకుంటుందా ? అంటూ నిలదీశారు. నాని చెప్పినట్లు 20 శాతం సీట్లంటే మొత్తం 175 సీట్లలో 35 సీట్లు మాత్రమే. అంటే నాని చెప్పినట్లుగా బీజేపీ 35 సీట్లలో డిపాజిట్లు తెచ్చుకుంటే చాలు కమలం పార్టీని గొప్ప పార్టీగా వైసీపీ గుర్తిస్తుందేమో.
మంత్రి ఈ చాలెంజ్ చేయటం వెనుక ఉద్దేశ్యం ఏమిటి ? ఏమిటంటే ఈరోజు విజయవాడలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రజాగ్రహ సభ జరగబోతోంది. ఇదే విషయాన్ని మీడియా ప్రస్తావించినపుడు మంత్రి పై చాలెంజ్ విసిరారు. ప్రతిపక్షాలు చెప్పుకోవటమే కానీ తమ ప్రభుత్వంపై జనాల్లో ఎక్కడా వ్యతిరేకత లేదన్నారు. 35 సీట్లలో బీజేపీని డిపాజిట్లు తెచ్చుకోవాలని మంత్రి సవాలు విసరటం వెనుక ఉద్దేశ్యం ఏమిటంటే పోయిన ఎన్నికల్లో వచ్చిన ఫలితం చూసే ఈ చాలెంజ్ విసురుంటారు.
2019 ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీకి ఒక్కటంటే ఒక్క సీటులో కూడా డిపాజిట్ రాలేదు. చాలా నియోజకవర్గాల్లో పోటీకి గట్టి అభ్యర్ధులే దొరకలేదు. పార్టీ పరువు పోతుందని ఎవరినో ఒకరికి బీఫాం ఇచ్చి నామినేషన్లు వేయించుకున్నారు. అప్పటికి ఇప్పటికి బీజేపీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. ఎందుకంటే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఎక్కడ కూడా పార్టీ గెలవలేదు. చాలా చోట్ల కనీసం నామినేషన్లు కూడా వేయలేకపోయింది.
ఇలాంటి నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో తామే అధికారంలోకి రాబోయేదంటు బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అండ్ కో పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. ఇలాంటి ప్రకటనలు చూసిన తర్వాత మంత్రికి మండిపోయుంటుంది. అందుకనే 35 సీట్లలో డిపాజిట్లు తెచ్చుకుంటే చాలన్నారు. బీజేపీ గెలుపు సీట్ల గురించి కూడా మంత్రేమీ మాట్లాడలేదు. కేవలం డిపాజిట్ల గురించే చెప్పారు. అంటే మంత్రి బీజేపీకి చాలా పెద్ద బంపర్ ఆఫరే ఇచ్చినట్లు లెక్క. మరి మంత్రి ఛాలెంజ్ ను వీర్రాజు స్వీకరిస్తారా ?
This post was last modified on December 28, 2021 10:52 am
https://youtu.be/g3JUbgOHgdw?si=jpCbsxB5cP_qeRwA ఇతర రాష్ట్రాల్లో ప్రభాస్ కాకుండా ఒక తెలుగు హీరోకి ఇంత క్రేజ్ ఏమిటాని అందరూ ఆశ్చర్యపోయే రీతిలో పుష్ప…
తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నటి కస్తూరి అరెస్ట్ తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇటీవల చెన్నై…
‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ఎంత డీగ్లామరస్గా కనిపిస్తాడో తెలిసిందే. ఒక ఎర్రచందనం కూలీ పాత్ర కావడంతో అందుకు తగ్గట్లు…
కోలీవుడ్లో చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించుకున్న దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్కు సంబంధం లేకుండా.. అంచనాలు…
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…