వైసీపీలో అంతర్గత కలహాలు.. అసమ్మతి.. అసంతృప్తి ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. కొందరు బయట పడుతున్నారు. మరికొందరు వేచి చూస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? కావాలి.. జగన్-రావాలి.. జగన్! అని నినదించిన గొంతులే.. ఇప్పుడు ఎందుకు భిన్నస్వరాలు రాగం తీస్తున్నాయి? అనే విషయం అత్యంతకీలకం. ఎంత ప్రజాదరణ ఉన్నా.. క్షేత్రస్థాయిలో పునాదులు కదలబారితే.. ఏం జరుగుతుందో.. 2019 ఎన్నికల్లో టీడీపీకి జరిగిన పరాభవం అందరికీ తెలిసిందే.
అంటే.. క్షేత్రస్థాయిలో నేతల మనోగతం.. వారి ఆలోచనలు.. పార్టీ కోసం వారు పడిన శ్రమ వంటివాటిని పరిగణనలోకి తీసుకోకపోతే.. నష్టపోయేది పార్టీనే. ఇప్పుడు ఈ విషయాలు ఎందుకు చర్చించాల్సి వస్తోందంటే.. కేవలం వారం వ్యవధిలో రెండు కీలక జిల్లాల్లో చోటు చేసుకున్న పరిణామాలు.. వైసీపీని తీవ్ర గందరగోళంలోకి నెట్టేశాయి. గుంటూరు జిల్లా చిలకలూరి పేటకు చెందిన మర్రి రాజశేఖర్.. బావమరిది.. ఇటీవల రోశయ్య సంస్మరణ సభలో వైసీపీపై నిప్పులు చెరిగారు.
పార్టీని నమ్ముకున్నవారికి పరాభవం తప్ప.. ఒరిగిందేంటని.. తన బావకు జరిగిన అన్యాయంపై గళం వినిపించారు. వాస్తవానికి నాయకుల ప్రచారం కన్నా.. ఇలాంటివారు చేసే వ్యాఖ్యలు చాలా పవర్ ఫుల్‌గాఉంటాయి. ఎందుకంటే..నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. ఏదో రాజకీయం కోసం చేశారని అనుకుంటారు. కానీ, నేరుగా రాజకీయాలతో సంబంధం లేనివారు కూడా ప్రభుత్వంపైనా.. పార్టీపైనా.. అసంతృప్తి వ్యక్తం చేశారంటే.. ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో వ్యతిరేకత ప్రారంభమైందనే అనుకోవాలి.
ఇక, ఇది జరిగి వారం కూడా గడవకముందే.. ప్రకాశం జిల్లాలో మరో అసంతృప్తి వెలుగు చూసింది. ఈ నెల 12న బాలినేని పుట్టినరోజు వేడుకల్లో సుబ్బారావు గుప్తా మాట్లాడుతూ…. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్‌లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదేసమయంలో భజన పరులకు తప్ప.. వైసీపీలో ఎవరికీ పదవులు దక్కడం లేదని వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఈ మాట అన్ని జిల్లాల్లోనూ.. ముఖ్యంగా జగన్ సొంత జిల్లా కడపలోనూ.. వినిపిస్తోంది. అయితే.. ఏ పార్టీ అయినా.. ఇలాంటి వ్యాఖ్యలు వచ్చినప్పుడు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో.. పరిశీలించేందుకు ప్రాధాన్యం ఇస్తాయి.
దానికి అనుగుణంగా పెరుగుతున్న వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తాయి. కానీ, వైసీపీ ఇప్పు డు దండించే పనిపెట్టుకుంది. వైసీపీ నాయకుడు మర్రి రాజశేఖర్‌ను పార్టీలో మరింత దూరం పెట్టారు. ఆయనను వైసీపీ జిల్లా నేతల వాట్సాప్ గ్రూపునుంచి తొలగించారు. ఇక, ఇటీవల బాలినేని సమక్షంలో మాట్లాడిన సుబ్బారావు గుప్తాకు మంత్రి అనుచరులు దేహశుద్ధి చేశారు. మరి.. ఏ పార్టీ అయినా.. ఇలాగేనా ప్రవర్తించేది? అని మేధావులుప్రశ్నిస్తున్నారు. సంతృ్ప్తి కోసం అసంతృప్త గళాలపై ఉక్కుపాదం మోపితే.. భవిష్యత్తు అంధకారమేనని.. అంటున్నారు. ఇప్పటికైనా.. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందన్న అంశాలపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.
This post was last modified on December 22, 2021 3:34 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…