ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ కూడా రూటు మార్చినట్లే కనిపిస్తున్నారు. కేవలం ప్రగతిభవన్ లేదా ఫాంహౌస్‌కే సీఎం పరిమితమవుతారంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చేందుకు ఆయన ఈ మధ్య బయటకు వస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందు జిల్లాల పర్యటన చేశారు. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల ఆగిపోయిన ఆయన మళ్లీ ఇప్పుడు జిల్లాల బాట పట్టనున్నారు. అయితే కేసీఆర్ పర్యటనల వెనక మళ్లీ ముందస్తు ఎన్నికల వెళ్లే ఆలోచన ఏమైనా ఉందా? అని విశ్లేషకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
2014 ఎన్నికల్లో గెలిచి తొలిసారి సీఎం పీఠంపై కూర్చున్న కేసీఆర్ 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. సార్వత్రిక ఎన్నికలతో పాటే రాష్ట్రంలోనూ ఎన్నికలు జరిగితే పార్టీ నష్టపోతుందనే ఉద్దేశంతో ఆయన ముందుగానే ఎన్నికలకు వెళ్లి భారీ విజయం సాధించారు. ఇప్పుడు కూడా అలాగే మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు ఆయన ప్రణాళికలు రచిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత ఓ వైపు.. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్‌లు రాష్ట్రంలో పుంజుకుంటున్న తీరు కేసీఆర్‌కు ఆందోళన కలిగిస్తోందని సమాచారం.
ముఖ్యంగా బీజేపీ తనకు కొరకరాని కొయ్యలా మారుతుందని ఆయన గ్రహించారని అందుకే ఆ పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని అంటున్నారు. మరోవైపు కేంద్రంలోని మోడీ సర్కారుపై కూడా ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. అందుకే దాన్ని ఇప్పుడే క్యాష్ చేసుకుని ఈ దశలోనే రాష్ట్రంలో బీజేపీకి చెక్ పెట్టేందుకు కేసీఆర్ ముందస్తు ఆలోచన చేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అందుకే ముందు సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టనున్నట్లు తెలిసింది.
దళిత బంధు లాంటి పథకాలను మరిన్ని తెరపైకి తెచ్చి ఆ తర్వాత ముందస్తు ఎన్నికల బరిలో దిగాలని అనుకుంటున్నట్లు సమాచారం. అందుకే ప్రజల్లో ప్రభుత్వంపై ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో తెలుసుకునేందుకు కేసీఆర్ జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. ఈ నెల 19 నుంచి ఆయన జిల్లాల్లో పర్యటిస్తారు. వనపర్తి జిల్లాతో మొదలెట్టి జనగామ, నాగర్‌కర్నూలు, జగిత్యాల, నిజామాబాద్, వికారాబాద్లో పర్యటిస్తారు. కొత్త కలెక్టరేట్ల ప్రారంభోత్సవం, ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభం.. ఇలా ఈ పర్యటనలో భాగంగా కేసీఆర్ చాలా కార్యక్రమాలే పెట్టుకున్నారు. అయితే ఇవన్నీ కేసీఆర్ ముందస్తు అంచనాల ప్రకారమే జరుగుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on December 17, 2021 1:56 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…