రాజకీయ వ్యూహకర్త.. జాతీయ రాజకీయాలపై.. పట్టు బిగిస్తానని చెబుతున్న ప్రశాంత్ కిశోర్.. తనేపెద్ద గందర గోళంలో పడిపోయారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. నిజానికి వ్యూహకర్తల లక్షణం ఏంటి? అంటే.. తాము అన్నీ పరిశీలించి.. ఒక నిర్ణయానికి వచ్చి.. బయటకు వెల్లడించాలి. అదే వ్యూహం గా మలుచుకుని ముందుకుసాగాలి. అయితే..దీనికి భిన్నంగా పీకే వ్యవహరిస్తున్నాడనే విమర్శలు వస్తు న్నాయి. ఆయన 2014లో మోడీని ప్రధానిని చేయడం కోసం .. శ్రమించారు. తర్వాత.. ఏపీలో జగన్ కోసం శ్రమించారు.
ఇక, తర్వాత.. నుంచి తనే వ్యూహాలు మార్చుకుంటూ.. ముందుకు సాగుతున్నాడు. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల సమయంలో మమతకు వ్యూహకర్తగా పనిచేసిన తర్వాత నుంచి పీకే వ్యూహాలు స్థిరంగా లేవనే వాదన బలంగా వినిపిస్తోంది. అసలు ఆయన వ్యూహలేమితో అల్లాడుతున్నాడనే వాదనా వినిపిస్తోంది. దీనికి కారణం.. ఈ రోజు చెబుతున్న విషయాన్ని ఆయన రేపటికి మార్చేస్తున్నారు. అంటే.. నాలిక మడతేసినట్టు..! గతంలో కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు పీకే. కాంగ్రెస్ లో స్వేచ్ఛలేదని.. అధిష్టానం పెత్తనమే ఉంటుందని.. తీవ్ర వ్యాఖ్యలే చేశారు.
అంతేకాదు.. కాంగ్రెస్ ఇలానే ఉంటే.. ఉన్నవారు కూడా పక్క పార్టీల్లోకి వెళ్లిపోతారని పీకే చెప్పారు. మరో అడుగు ముందుకు వేసి.. రాహుల్‌కు ప్రధాని అయ్యే లక్షణాలు లేవని.. ఆయన విషయంలో క్షేత్రస్థాయి లో ప్రజల ఆలోచన భిన్నంగా ఉందని చెప్పారు. ప్రధాని మోడీపై వ్యతిరేకత ఉన్నా.. దానిని కాంగ్రెస్ అందిపుచ్చుకోవడంలో విఫలం అవుతోందని అన్నారు. అంతేకాదు.. ప్రతి విషయాన్నీ.. రాహుల్.. సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదంటూనే.. మరోవైపు.. రాహుల్‌కు నాయకత్వ లక్షణాలు లేవని కొన్నిరోజుల కిందట గోవాలో నిప్పులు చెరిగాడు.
అయితే.. ఇప్పుడు పీకే.. తన వ్యాఖ్యలకు పూర్తి భిన్నంగా వ్యాఖ్యానించారు. రాహుల్‌కు ప్రధాని అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని.. చెప్పుకొచ్చారు. రాహుల్ ప్రధాని కావాలని.. యువత కోరుకుంటోం దని అన్నారు. అంతేకాదు.. కేంద్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందని చెప్పిన నోటితోనే.. ఇప్పుడు కేంద్రంలో.. కాంగ్రెస్ లేకుండా.. అసలు ప్రభుత్వమే ఏర్పాటు కాదని పీకే వ్యాఖ్యానించడం గమనార్హం. మొత్తానికి ఈ వ్యాఖ్యలు పరిశీలిస్తే.. పీకేకు.. అసలు.. వ్యూహం ఉందా? ఆయన మైండ్‌కు ఏమైనా అయిందా? అనే సందేహాలు వ్యక్తం అవుతుండడం గమనార్హం.
This post was last modified on December 17, 2021 10:10 am
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…