Political News

ఏకమైన వైసీపీ, టీడీపీ ఎంపీలు

మొత్తానికి ఒక్క విషయంలో మాత్రం అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్ష ఎంపీలు చేతులు కలిపారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర  మూడు రోజులుగా జరుగుతున్న బీసీ సంక్షేమ సంఘాల ధర్నాలో రెండు పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. బీసీ డిమాండ్లకు రెండు పార్టీల ఎంపీలు సంఘీభావం ప్రకటించటం గమనార్హం. దేశ జనాభా లెక్కలు సవరించాలని, బీసీల కులగణన చేయాలనే డిమాండ్ తో రెండు రాష్ట్రాల బీసీల సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతున్నాయి.

రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కానీ, ప్రాజెక్టుల విషయంలో కానీ, ఏపీకి నరేంద్ర మోడీ సర్కార్ ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్న ద్రోహం విషయంలో కానీ రెండు పార్టీలు ఎప్పుడూ కలిసింది లేదు. ఒక పార్టీ ఎంపీ పార్లమెంటులో రాష్ట్ర ప్రయోజనాలపై గట్టిగా మాట్లాడిందంటే వెంటనే రెండో పార్టీ మరో పార్టీని టార్గెట్ చేయటమే ఇంతకాలం జనాలందరూ చూశారు. రాష్ట్ర ప్రస్తుత పరిస్థితికి మీరే కారణమంటే కాదు మీరే కారణమని ఒకరిని మరొకరు నిందించుకోవటంతోనే పుణ్యకాలం గడచిపోతోంది.

రెండు పార్టీల మధ్య ఉన్న విభేదాలను నరేంద్ర మోడీ చాలా తెలివిగా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. రెండు పార్టీలను అడ్డంపెట్టుకుని ఏకంగా రాష్ట్రప్రయోజనాలనే మోడి తుంగలో తొక్కేస్తున్నారు. అయినా రెండు పార్టీల ఎంపీలకు ఏమాత్రం బాధుండటం లేదు. రాష్ట్రంలోనే కాకుండా పార్లమెంటు వేదికగా రెండుపార్టీల ఎంపీలు ఒకరిపై మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుని రాష్ట్రం పరువు తీసేస్తున్నారు. ఇన్ని సంవత్సరాలుగా పార్లమెంటు లోపలా బయటా జరుగుతున్నదిదే.

అలాంటిది కేంద్రానికి వ్యతిరేకంగా బీసీ సంక్షేమ సంఘాలు చేస్తున్న నిరసనకు పోటీలు పడి రెండు పార్టీల ఎంపీలు ఎందుకని మద్దతు ప్రకటించాయి. ఎందుకంటే బీసీల ఓటు బ్యాంకు అవసరం కాబట్టే. రాబోయే ఎన్నికల్లో వైసీపీ అధికారాన్ని నిలుపుకోవాలన్నా, టీడీపీ అధికారంలోకి రావాలన్నా బీసీల మద్దతు చాలా చాలా అవసరం. దశాబ్దాల పాటు టీడీపీనే అంటిపెట్టుకునున్న బీసీ ఓటుబ్యాంకులో మొదటిసారి  2019 ఎన్నికల్లో చీలికొచ్చింది.  అందుకనే వైసీపీకి 151 అఖండ మెజారిటి సాధ్యమైంది.

అందుకనే దూరమవుతున్న బీసీ ఓటు  బ్యాంకును మళ్ళీ దగ్గర చేసుకోవాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే బీసీ సంక్షేమ సంఘాల నిరసనల్లో పాల్గొంది. అలాగే బీసీలను మరింత ఆకర్షించటమే టార్గెట్ తో జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. ప్రతిపక్షంలో ఉన్నపుడే కాదు ఇపుడు కూడా బీసీలకు మంచి ప్రాధాన్యతే ఇస్తున్నారు. కాబట్టి సహజంగానే బీసీల నిరసనలో వైసీపీ ఎంపీలు పొల్గొన్నారు. ఎవరి హిడెన్ అజెండా ఎదైనా బీసీల నిరసనల్లో రెండు పార్టీల ఎంపీలు కలిసింది వాస్తవం. ఇలాగే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కూడా కలిస్తే కేంద్రం దిగిరాదా ?

This post was last modified on December 15, 2021 1:07 pm

Share

Recent Posts

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

11 minutes ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

29 minutes ago

తమిళ రాజకీయాల్లోకి ఇంకో స్టార్?

జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…

37 minutes ago

ట్రెండింగ్ సాంగ్ ‘జిలేబి’ని ఎవరు వాడుకుంటారో

ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…

2 hours ago

జ్ఞానేష్ కుమార్‌ను ఇప్పటికిప్పుడు తొలగించలేం

కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చ‌రిక చేసింది. ఆయన త‌ప్పు చేసిన‌ట్టు నిరూపిత‌మైతే.. క‌చ్చితంగా…

3 hours ago

మళ్లీ మొదలైన కొలికపూడి పంచాయితీ

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…

3 hours ago