వైసీపీలో ఒక విషయం ఆసక్తిగా మారింది. అంతకు మించి గుసగుసగా చర్చనీయాంశంగా తయారైంది. ముఖ్యంగా తాడేపల్లి వర్గాలు ఈ విషయంపై చర్చకు తావిచ్చేలా వ్యవహరిస్తున్నాయని అంటున్నారు పార్టీ నేతలే! దీనికి కారణం.. చూస్తే.. ఇటీవల కాలంలో ప్రతిపక్షాల దాడి ఎక్కువైంది. అయిన దానికి కాని దానికి కూడా ప్రతిపక్షాలు భారీ రేంజ్‌లో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో.. విపక్షాలకు సరైన విధంగా సమాధానం చెప్పాలని.. చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు.. ముఖ్యంగా జగన్ అభిమానులుగా ఉన్నవారు భావిస్తున్నారు.
వీరిలో అనంతపురం నుంచి విశాఖ వరకు.. చాలా మందే కనిపిస్తున్నారు. కానీ.. ఒకరిద్దరికి తప్ప..ఛాన్స్ దక్కడం లేదు. అది కూడా.. నేరుగా మీడియాతో మాట్లాడడానికి లేదని.. స్పష్టంగా ఆదేశాలు ఉన్నాయని చర్చ సాగుతోంది. నిజమే.. ఎవరు బడితే.. వారు మీడియాతో మాట్లాడకూడదనే ఉద్దేశంతోనే అధికార ప్రతి నిధులను పార్టీలు నియమించుకుంటాయి. అలానే వైసీపీలోనూ అధికార ప్రతినిధులు ఉన్నారు. అయితే.. ఇప్పుడు వారు కూడా ఎక్కువ మంది మీడియా ముందుకు రావడం లేదు.
ఒకరిద్దరు మాత్రమే యాక్టివ్ గా ఉంటున్నారు. దీంతో అసలు ఏం జరిగిందనే విషయం చర్చకు దారితీసిం ది. దీనిని పరిశీలిస్తే.. అధికార ప్రతినిధులు కూడా తాడేపల్లి నుంచి అనుమతి పొందాల్సిన పరిస్థితి ఏర్ప డిందని అంటున్నారు. అంటే. ఒక కీలక సలహాదారు అనుమతి ఉంటే తప్ప.. అధికార ప్రతినిధి అయిన ప్పటికీ.. మీడియా ముందుకు రాకూడదనే కట్టుబాటును అమలు చేస్తున్నారట. దీంతోటీడీపీ సహా ఇతర పార్టీల నుంచి ఎదురవుతున్న సూటి పోటి విమర్శలకు తాము సమాధానం చెప్పలేక పోతున్నామని అంటున్నారు.
ఈ విషయంలో పార్టీ అధిష్టానం పరిశీలించాలని నాయకులు కోరుతున్నారు. ఎక్కడ అవసరమైతే.. అక్క డ ఎప్పుడు అవసరం అనుకుంటే.. అప్పుడు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని.. ఈ విషయంలో పీకులాట ఎందుకని నాయకులు కోరుతున్నారు. మరి ఈ విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
This post was last modified on December 13, 2021 3:26 pm
ఏపీలో కూటమి సర్కారు అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం రికార్డ్ సృష్టించింది. గత ఏడాది ప్రారంభించిన ఈ పథకం…
అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…
ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…
ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం…
ఏదైనా కథ, పాత్ర, లేదా పాట విషయంలో పాత సినిమాల నుంచి స్ఫూర్తి పొందడం కొత్తేమీ కాదు. ఐతే అలా…