ఏపీలోని జగన్ ప్రభుత్వంపై.. సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఆయన చేస్తున్న అప్పులు.. వ్యవహరి స్తున్న తీరు.. జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తోంది. ఇటీవల.. విద్యుత్ బకాయిల చెల్లింపు విషయంపై పీఆర్ సీ(పవర్ రెగ్యులేటరీ కమిషన్) తీవ్రస్థాయిలో మండిపడింది. విద్యుత్ బకాయిలు రు.2000 కోట్లు తక్షణమే కట్టాలని లేకపోతే.. దివాలా ప్రకటిస్తామని పేర్కొంది. ఇదే జరిగితే.. రాష్ట్ర పరువు పోయినట్టే అయ్యేది. ఇక, రిజర్వ్ బ్యాంకు వద్ద కూడా పరువు రెపరెపలాడుతోంది. ఏ చిన్న తేడా వచ్చినా.. దివాలా ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలోనే జగన్ ప్రభుత్వంపై నలుదిక్కుల నుంచి విమర్శలు చుట్టుముడుతున్నాయి. ఎప్పుడైనా రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణుల నుంచి కూడా హెచ్చరికలు వస్తున్నాయి. ఈ నేపత్యంలో జగన్ ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు ఊడుతుందో.. తెలియని పరిస్థితి నెలకొందని.. ఒక రకంగా జగన్ ప్రభుత్వం పరిస్థితి గాలిలో దీపంగా మారిందని నిపుణులు సైతం పేర్కొన్నారు. ఈ క్రమంలో తాజాగా స్పందించిన టీడీపీ నేత, ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు ఊడుతుందో తెలియదని వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసేశారని మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండని చెప్పి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి ఎంత హక్కు ఉందో ప్రతిపక్షానికి కూడా అంతే హక్కు ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని పోలీసులతో గొంతు నోక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రౌడి రాజ్యం నడుస్తోందని..ఈ ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందో… ఎప్పుడు పోతుందో తెలియదని యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మరిదీనికి వైసీపీ నుంచి ఎలాంటి కౌంటర్ వస్తుందో చూడాలి.
This post was last modified on December 13, 2021 6:37 am
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…
అలియా భట్ ఎలా అన్ని బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తుందో చూసి చాలామందికి ఆశ్చర్యమే. కొత్త ఇల్లు, సినిమాలు, బిజినెస్ పనులు,…
రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభ డిసెంబర్ 25 మళయాళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా…