Political News

తిరుపతిలో అమరావతి జేఏసీ సెంటిమెంట్ !

మహా పాదయాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో అమరావతి జేఏసీ బలప్రదర్శనకు రెడీ అవుతోందా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఈనెల 16వ తేదీకి పాదయాత్ర తిరుపతికి చేరుకుంటుంది. ఈ సందర్భంగా తిరుపతిలో భారీ ఎత్తున వివిధ పార్టీల శ్రేణులు ఏకమవ్వాలని ప్లాన్ జరుగుతోందట. టీడీపీ నేతృత్వంలో జరుగుతున్న పాదయాత్రలో బీజేపీ, జనసేన, సీపీఐ, సీపీఎం పార్టీల నేతలు పార్టిసిపేట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.  

పాదయాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని పార్టీలు రెడీ అయిపోతున్నాయి. చిత్తూరు జిల్లాలోకి పాదయాత్ర ఎంటరైన దగ్గర నుండి పై పార్టీల నేతలంతా సమన్వయంతోనే ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుపతి అంటేనే రాష్ట్రంలో ప్రత్యేక ఇమేజి ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఏ కార్యక్రమం నిర్వహించినా అందుకు వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలుంటాయనే సెంటిమెంటు ఉంది.

ఈ సెంటిమెంటులో భాగంగానే భారీ బహిరంగ సభ నిర్వహణకు రెడీ అయ్యారు. అయితే దీనికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అందుకనే అర్జంటుగా కోర్టును ఆశ్రయించే పనిలో నిర్వాహకులు ఉన్నారు. కోర్టు బహిరంగ సభకు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా బలప్రదర్శన ద్వారా సత్తా చాటాలని అమరావతి జేఏసీ తరపున పై పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. సభ జరిగితే జనాలను తీసుకురావటం లేకపోతే పెద్ద ఎత్తున తిరుపతి వీధుల్లో ర్యాలీ నిర్వహించాలని నిర్వాహకులు అనుకుంటున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే పై పార్టీల నేతలంతా ఒక జట్టుగా ఏర్పడి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

అయితే ఇక్కడే ఒక సమస్య వచ్చింది. అదేమిటంటే అమరావతి పాదయాత్రను తిరుపతిలో అడ్డుకుంటామంటు రాయలసీమ మేధావుల ఫోరం, వైయస్సార్ విద్యార్థి విభాగం ప్రకటించారు. నిజానికి పాదయాత్రను కానీ లేదా బహిరంగ సభ లేదా ర్యాలీని ఎవరు కూడా అడ్డుకోవాల్సిన అవసరం లేదు. అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలని అమరావతి జేఏసీ కోరుకోవడంలో తప్పేలేదు. అలాగే మూడు రాజధానులు ఉండాలని డిమాండ్ చేయటమూ తప్పుకాదు.

అంత మాత్రం దానికి ఒకళ్ళని అడ్డుకుంటామని మరొకళ్ళు హెచ్చరించటం మాత్రం తప్పే. ఎందుకంటే దీనివల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లెమ్ తలెత్తుతుంది. దీనివల్ల ప్రభుత్వం అంటే అధికార పార్టీకి నష్టమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు అమరావతి జేఏసీ పాదయాత్రను పట్టించుకోని వారు చూడా రేపు గొడవ జరిగితే ఏమైందని ఆరా తీస్తారు. కాబట్టి ఒకళ్ళ విషయంలో మరొకళ్ళు పట్టించుకోకుండా ఉంటేనే అందరికీ మంచిది.

This post was last modified on December 12, 2021 11:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వరల్డ్ కప్ పై గంభీర్ ఘాటు రిప్లై, వాళ్లిద్దరి గురించేనా?

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ విజయం తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తనదైన స్టైల్లో స్పందించారు. 2027 వరల్డ్…

2 minutes ago

పడయప్ప… తెలుగులో కూడా రావాలప్ప

సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు భాష, నరసింహ, దళపతి. వీటిని…

38 minutes ago

జగన్ చేసిన ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై అసలు దొంగ ఏమన్నాడో తెలుసా?

తాను చేసింది మహా పాపమే అంటూ.. పరకామణి చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు రవికుమార్ తెలిపారు. ఈ వ్యవహారంలో…

2 hours ago

ఇండి’గోల’పై కేటీఆర్ ‘పెత్తనం’ కామెంట్స్

బీఆర్ ఎస్ కార్యనిర్వాహ‌క అధ్య‌క్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అధికారం ఒక‌రిద్ద‌రి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…

3 hours ago

దేవరకొండా… ఇక ఆ సినిమా దేవుడికేనా?

తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…

6 hours ago

బిగ్ బాస్-9‌లో ఇతనే పెద్ద సర్ప్రైజ్

ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…

6 hours ago