Political News

మోడీ హిందువు కాదు.. త‌రిమికొట్టండి: రాహుల్

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీపై తొలిసారి.. కాంగ్రెస్ నాయ‌కుడు, మాజీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ తీవ్ర‌స్థాయిలో విజృంభించారు. మోడీ హిందువు కాద‌ని.. ఆయ‌న హిందూత్వ వాది అని చెప్పారు. హిందువును అధికారంలోకి ఉంచుకోవ‌చ్చ‌న్న ఆయ‌న‌.. హిందూత్వ‌వాదిని ఒక్క నిముషం కూడా అధికారంలోకి ఉంచ‌డానికి వీల్లేద‌ని చెప్పారు. మోడీని త‌రిమికొట్టేందుకు ప్ర‌జ‌లు స‌న్న‌ద్ధులు కావాల‌ని రాహుల్ పిలుపునిచ్చారు.

భారత రాజకీయాల్లో హిందూ- హిందుత్వవాది అనే రెండు పదాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది అని రాహుల్ గాంధీ చెప్పారు. రాజ‌ధాని రాజ‌ధాని జైపూర్‌లో జరిగిన బహిరంగ సభలో చాలా ఉద్వేగంగా ఆయ‌న ప్ర‌సంగించారు. ప్ర‌తి మాట‌లోనూ మోడీని టార్గెట్ చేశారు. అదేస‌మ‌యంలో బీజేపీని కూడా ఎండ‌గ‌ట్టారు. మ‌హాత్మాగాంధీ హిందూ అని, గాడ్సే హిందుత్వవాదని చెప్పారు. హిందుత్వవాదులు జీవితామంతా అధికారం కోసం తపిస్తుంటారని విమర్శించారు.

ఇలాంటి వారిలో క‌ర‌డు గ‌ట్టిన హిందూత్వ వాదానికి మోడీ ప్ర‌తిరూప‌మ‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. హిందుత్వవాదులు సత్యాగ్రహం పాటించరని, అధికారం కోసం పాకులాడతారని ఎద్దేవా చేశారు. హిందుత్వవాదులు 2014 నుంచి అధికారంలో ఉన్నారని, వారిని అధికారం నుంచి తొలగించి హిందువులకు అధికారం కట్టబెట్టాలని,.. త‌క్ష‌ణ‌మే వారిని త‌రిమి కొట్టాల‌ని రాహుల్ పిలుపునిచ్చారు. హిందువంటే అందరినీ కలుపుకుని పోయేవాడని, ఎవరికీ భయపడడని రాహుల్ చెప్పారు. అన్ని మతాలనూ గౌరవించేవాడే హిందువ‌ని అన్నారు.

”కానీ, మోడీకి ఎస్సీలంటే గిట్ట‌రు. ముస్లిం మైనార్టీ అంటే.. గిట్ట‌దు. వారికి ఎవ‌రికీ ఎన్నిక‌ల్లో ప్రాతినిధ్యం కూడా క‌ల్పించ‌రు. క‌నీసం.. వారిని చూసేందుకు కూడా ఇష్ట‌ప‌డ‌రు. అలాంటి వారిని హిందువుగా ఎలా ప‌రిగ‌ణిస్తాం. వారికి గాడ్సే దేవుడు. గాడ్సే జ‌యంతులు వారికి పండ‌గ‌లు. అలాంటి వారు ఒక్క‌నిముషం కూడా అధికారంలో ఉండేందుకు అవ‌కాశం లేదు. ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టి అధికారంలోకి వ‌చ్చారు. హిందువుగా చ‌లామ‌ణి అవుతున్న పెద్ద హిందూత్వ వాది!” అని మోడీని కార్న‌ర్ చేస్తూ.. నిప్పులు చెరిగారు. కాగా, జైపూర్ బహిరంగసభకు జనం క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో తరలివచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు సీఎం అశోక్ గెహ్లాట్ పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఈ సభకు హాజరయ్యారు.

This post was last modified on December 12, 2021 8:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago