ఏపీ సీఎం జగన్ అంటే ప్రజలకు ఎంతో అభిమానమని .. ఆ పార్టీ నేతలు తరచుగా చెబుతుంటారు. అంతే కాదు.. ప్రజలకు ఉన్న అభిమానమే ఎన్నికల్లో ఓట్ల రూపంలో రాలుతోందని కూడా వినిపిస్తుంటారు. అయితే.. ఇప్పుడు నిజంగానే ప్రజలు జగన్‌పై అభిమానం చూపిస్తున్నారు. జగనన్న ఉన్నాడు జాగ్రత్త
అంటూ.. రోడ్లపై బ్యానర్లు పెడుతున్నారు. దీనికి కారణం ఏంటి. ఎందుకు? అంటే.. చిత్రమైన సమాధానమే వస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పరిస్థితి ప్రస్తుతం వర్ణనాతీతం. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు తీవ్ర అధ్వాన్న పరిస్థితిలో ఉన్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో రోడ్లు చాలా వరకు అధ్వానంగా మారాయి. ఎక్కడ రోడ్డుందో.. ఎక్కడ గుంత ఉందో తెలియని పరిస్థితి నెలకొంది.
అయితే అధికారంలో ఉన్న జగన్ సర్కారు మాత్రం రోడ్ల బాగు గురించి సరిగ్గా పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో గోదావరి జిల్లాల ప్రజలు జగన్ సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే తమ వెటకారంతో జగన్ సర్కారుకు హెచ్చరికలు చేస్తున్నారు.
ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలోని ఓ రోడ్డుపై పెట్టిన బోర్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘జగన్ అన్న ఉన్నాడు జాగ్రత్త.. రోడ్డు వేసే వరకు ఎవరైనా ఈ బోర్డును తొలగిస్తే వారి కుటుంబం ఈ రోడ్డుపైనే పోతుంది’ అనేలా జగన్ ఫొటోలతో ఫ్లెక్సీ చేయించి బోర్డు పెట్టారు.
ఈ ఫొటోలను జనసేన అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేసి ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్నారు. గతంలో కొందరు విశాఖలోనూ.. ఇలానే రోడ్ల దుస్తితిపై.. చమత్కారంగా.. చురకలు అంటించారు. అయినప్పటికీ.. ప్రభుత్వం స్పదించలేదు. మరి ఇప్పటికైనా.. సర్కారు ఏమైనా రియాక్ట్ అవుతుందో లేదో చూడాలి.
This post was last modified on December 12, 2021 2:38 pm
ఈ ఏడాది పెట్టుబడి రాబడి లెక్కల్లో అత్యంత లాభదాయకం అనిపించిన సినిమాలో కోర్ట్ ఒకటి. న్యాచురల్ స్టార్ నాని నిర్మాణంలో…
ఏమాత్రం కనికరం లేకుండా భారత హిందువుల ప్రాణాలు తీసిన ఉగ్రదాడిలో పాక్ ఆర్మీ హస్తం ఉన్నట్లు బహిర్గతమైన విషయం తెలిసిందే.…
మంత్రి నారా లోకేష్ వ్యూహాత్మక పెట్టుబడుల వేటలో కీలకమైన రెన్యూ ఎనర్జీ ఒకటి. 2014-17 మధ్య కాలంలో కియా కార్ల…
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి, ఫైర్బ్రాండ్.. కొడాలి నానికి రాజకీయంగా గుడివాడ నియోజకవర్గంలో గట్టి పట్టుంది. ఆయన వరుస విజయాలు…
పంజాబ్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్ పూర్ణం కుమార్ షా బుధవారం స్వదేశానికి సురక్షితంగా…
మే 30 విడుదల కావాల్సిన కింగ్ డమ్ విడుదల అధికారికంగా వాయిదా పడింది. పోస్ట్ పోన్ వార్త పాతదే అయినా…