Political News

మోడీకి తన గ్రాఫ్ పడిపోతోందని అర్థమైందా ?

చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. లేకపోతే పార్లమెంటుకు ఎంపీలు హాజరవ్వాలని, పార్లమెంట్ లో జరిగే చర్చల్లో సక్రమంగా పాల్గొనాలని ఎంపీలకు క్లాసు ఎందుకు పీకుతారు ? ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీల వైఖరిపై ప్రధాని చాలా సీరియస్ అయ్యారు. చాలామంది ఎంపీలు అసలు పార్లమెంటుకే హాజరు కావడం లేదని తన అసహనాన్ని వ్యక్తంచేశారు. ఎంపీలందరూ పార్లమెంటు సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరవ్వాలని చిన్నిపిల్లలకు చెప్పినట్టు ఎన్నిసార్లు చెప్పాలంటు మండిపోయారు. పార్లమెంటుకు గైర్హాజరయ్యే ఎంపీలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లిచ్చేది లేదని కూడా వార్నింగ్ ఇచ్చారు.

నిజానికి పార్లమెంటు సమావేశాలకు హాజరవ్వమని మోడీ తన ఎంపీలకు చెప్పాల్సిన పనేలేదు. ఎందుకంటే ఎంపీలుగా ఎన్నికైందే పార్లమెంటుకు హాజరై తమ నియోజకవర్గాల్లోని సమస్యలను ప్రస్తావించి పరిష్కరిస్తారని.  మరి మౌలిక బాధ్యతల నుండి ఎంపీలు పక్కకు వెళ్ళిపోతే ఇక ఎంపీలుగా ఉండటం దేనికి ? వారు తీసుకునే జీత, బత్యాలు, సౌకర్యాలన్నీ ప్రజలు చెల్లించే పన్నుల నుండే కదా అందుతున్నది. ఇదే విషయాన్ని బహుశా మోడీ కూడా ఎంపీలకు గుర్తు చేసినట్లున్నారు.

ఎంపీల ప్రవర్తనలో మార్పు రాకపోతే లేదంటే మార్పులు వాటంతట అవే వచ్చేస్తాయని చాలా సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చారు. అంతా బాగానే ఉంది కానీ  అసలు ఎంపీలకు మోడీ వార్నింగ్ ఇవ్వాల్సినంత అవసరం ఎందుకొచ్చింది ? ఎందుకంటే మోడీ చెప్పినా ఎంపీలు వినటం లేదు కాబట్టే. ఎంపీలందరూ క్రమం తప్పకుండా పార్లమెంటు సమావేశాలకు హాజరవ్వాలని మోడీ చెప్పడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా చాలాసార్లు చాలా గట్టిగానే చెప్పారు. అయినా ఎంపీలు వినటం లేదంటే అర్థమేంటి ?

ఏమిటంటే పార్టీపై మోడీ పట్టు జారి పోతోందనే అనుకోవాలి. ఈ మధ్యనే జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఉపఎన్నికల్లో బీజేపీ ఓడిపోవటం, పశ్చిమ బెంగాల్ లో ఎంత ప్రయత్నించినా మమతా బెనర్జీని ఓడించలేకపోవటం తదితరాల వల్ల మోడీ గ్రాఫ్ పడిపోతోందట. అలాగే ఉత్తర ప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలు పార్టీకి ఏ మాత్రం ఆశాజనకంగా లేవని అర్థమైపోతోంది. తొందరలో జరగబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గనుక ఓడిపోతే మోడీకి ఇబ్బందులు మొదలైనట్లే అనుకోవాలి.

వీటన్నింటికీ అదనంగా ఆ మధ్య యూపీలో జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో సొంత నియోజకవర్గం వారణాశిలోనే బీజేపీ చాలా చోట్ల ఓడిపోయింది. ఇక యూపీలో బీజేపీ నేతలపై స్థానికులు ఎక్కడికక్కడ తిరగబడుతున్నారు. ఇలాంటి అనేక ఘటనలతో మోడీపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోందనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. దీనికితోడు మోడీ పార్లమెంటు సమావేశాలకు హాజరైనా ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానాలు చెప్పటంలో బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి అనేక కారణాలతో మోడీ గ్రాఫ్ పడిపోతోందని అందుకనే ఎంపీలు కూడా లెక్కచేయటం లేదని సమాచారం.

This post was last modified on December 8, 2021 6:27 pm

Share

Recent Posts

కౌంట్ బాగుంది… ప్రేక్షకుల క్వాంటిటీ పెరగాలి

నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…

16 minutes ago

లీక్ చెయ్యడానికి అదేమైనా ఆ టైపు సినిమానా?

ఈ శుక్రవారం ఒకేసారి నాలుగైదు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. ఇంత పోటీలో వస్తున్నపుడు ప్రేక్షకుల దృష్టి తమ చిత్రం మీద…

1 hour ago

తారక్ కోపం వంద శాతం సమర్ధనీయం

ఏఐ దుర్వినియోగమవుతున్న తీరు చూస్తుంటే టెక్నాలజీ తాలూకు పరిణామాలు ఇంత దారుణంగా ఉంటాయా అనిపిస్తుంది. రోబోలో ఒక యంత్రం హీరోయిన్…

1 hour ago

ఫ్యాన్ బుగ్గ గిల్లుడు… షాక్ అయిన హీరోయిన్

ఫిలిం సెలబ్రెటీలు పబ్లిక్‌లోకి రావాలంటే భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయిప్పుడు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని ఎక్కడికైనా సరే జనం…

2 hours ago

‘ఏకం’తో లోకల్ వార్ లోకి కేకే సర్వే కిరణ్!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు ఎన్ని స్థానాల్లో గెలవబోతున్నాయి? వైసీపీకి ఎన్ని స్థానాలు…

3 hours ago

సరిహద్దులు దాటిన పీఓకే బాలిక.. తిరిగి వెళుతుందా?

భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…

4 hours ago