శాసన మండలి ఛైర్మన్‌గా మోషేన్ రాజు, క్షత్రియ కార్పోరేషన్ ఛైర్మన్‌గా పాతపాటి సర్రాజు, జడ్పీ ఛైర్మన్‌గా కవురు శ్రీనివాస్, డీసీసీబీ ఛైర్మన్‌గా పీవీఎల్ నరసింహరాజు, డీఎస్ఎంఎస్ ఛైర్మన్‌గా వెంకటస్వామి.. ఇలా వివిధ స్థాయిల్లో ఛైర్మన్లుగా ఉన్న వీళ్లంతా భీమవరం నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు. సీఎం జగన్ ఆ నియోజకవర్గంపై ప్రధాన దృష్టి సారించడానికి చెప్పేందుకు ఈ జాబితానే ఉదాహరణ. వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజుకు చెక్ పెట్టేందుకే జగన్ ఆ నియోజకవర్గానికి చెందిన నాయకులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని టాక్.
ఆ వ్యూహంతో..
రాష్ట్రంలో భీమవరం నియోజకవర్గంలోని వైసీపీ నేతలకు జగన్ అధిక ప్రాధాన్యతనిస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వీలైనన్ని ఎక్కువ పదవులు ఆ నియోజకవర్గం నాయకులకే దక్కుతున్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే దీని వెనక పవన్‌కు, రఘురామకు చెక్ పెట్టాలనే జగన్ వ్యూహం దాగి ఉన్నట్లు సమాచారం. 2024 ఎన్నికల్లో భీమవరం నియోజకవర్గం నుంచి మరోసారి పవన్ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు నరసాపురం ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణం రాజు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. అందుకే భీమవరం నాయకులకు పదవులు ఇచ్చి.. అక్కడ పార్టీని మరింత బలోపేతం చేసి పవన్‌కు, రఘరామకు షాక్ ఇవ్వాలని జగన్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
వాళ్ల ఓట్ల కోసం..
నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నరసాపురం, భీమవరం నియోజకవర్గాల్లో క్షత్రియ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంది. మిగిలిన నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గం బలంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పవన్, రఘురామను నిలువరించాలంటే వచ్చే బీసీ, ఎస్సీ, ఎస్టీలతో పాటు క్షత్రియ సామాజిక వర్గాన్ని కూడా ఆకట్టుకోవాలనదే జగన్ ప్రయత్నంగా కనిపిస్తోంది. అందుకే ఇక్కడ వైసీపీ నేతలకు ఆయన పదవులు ఇస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు గ్రంధి శ్రీనివాస్‌కు కూడా కొత్తగా ప్రకటించే కేబినేట్‌లో స్తానం దొరికే అవకాశం ఉందని అంటున్నారు. మరి జగన్ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలంటే వచ్చే ఎన్నికల ఫలితాల వరకూ ఆగాల్సిందే.
This post was last modified on December 4, 2021 1:11 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…