ఏప్రిల్ 30 ఎంతో దూరం లేదు. కేవలం నలభై నాలుగు రోజులే బ్యాలన్స్. షూట్, పోస్ట్ ప్రొడక్షన్, రీ రికార్డింగ్, ప్రమోషన్ అన్నీ ఇందులోనే అయిపోవాలి. ట్విస్ట్ ఏంటంటే ఇంకా స్పెషల్ సాంగ్ తీయలేదు. దర్శకుడు బుచ్చిబాబు హీరోయిన్ల కోసం తెగ ట్రై చేస్తున్నారని ఇన్ సైడ్ టాక్. రంగస్థలంలో పూజా హెగ్డే లాగా కాకుండా ముగ్గురు నలుగురు ఉంటే ఎలా ఉంటుందనే కోణంలో ఆలోచిస్తున్నారట. కాకపోతే ఇది అనుకున్నంత ఈజీ కాదు.
ఎందుకంటే ఎంత రామ్ చరణ్ అయినా, క్రేజ్ ఉన్న హీరోయిన్లు స్పెషల్ సాంగ్ కోసం డేట్స్ ఇవ్వడం చాలా కష్టంగా ఉంది. మృణాల్ ఠాకూర్ పేరు గట్టిగానే వినిపించింది కానీ తర్వాత ఎలాంటి సౌండ్ లేదు. హలో బ్రదర్ లో కన్నెపిట్టరో కన్నుకొట్టరో స్టైల్ ని మార్చి దాన్నే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తీసేలా బుచ్చిబాబు ఏదో డిఫరెంట్ గా ప్లాన్ చేసినట్టు ఉన్నారు. ఎక్కువ సమయం ఉంటే ఇదేమీ అసాధ్యం కాదు కానీ టైం ప్రెజర్ పెట్టుకుని డెడ్ లైన్ మీట్ కావడం పెద్ద సవాలే.
ఇంకో వారం పది రోజుల్లో దీని సంగతి తేల్చేయాలి. ఎందుకంటే కనీసం రెండు వారాల స్పేస్ పబ్లిసిటీ కోసం వాడుకోవాలి. అంటే ఏప్రిల్ మూడో వారం కల్లా బుచ్చిబాబు ఫస్ట్ కాపీ సిద్ధం చేయాలి. చివరి నిమిషం ఒత్తిళ్లు ఎలాగూ తప్పవు కానీ వీలైనంత తగ్గించుకుంటే బెటర్. వచ్చే నెల ఫస్ట్ వీక్ లోపలే ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టాలి. లేదంటే పెద్ద నెంబర్లు నమోదు కావు. అందుకే ఉరుకులు పరుగులు పెట్టాల్సిందే.
బిజినెస్ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తున్నాయి. ఏరియాల వారీగా ఒక్కొక్కటిగా క్లోజ్ చేసేందుకు నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు. ఎప్పుడూ వినని నాన్ రాజమౌళి నెంబర్లైతే గ్యారెంటీగా వచ్చేలా ఉన్నాయి. పుష్పని టచ్ చేయడమో లేదా దాటడమో పక్కాని ట్రేడ్ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. క్రేజ్ చూస్తుంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు కానీ అభిమానులు థర్డ్ సింగల్ కోసం ఎదురు చూస్తున్నారు. చరణ్ – జాన్వీ కపూర్ మధ్య డ్యూయెట్ ఏదైనా వస్తుందేమోనని వెయిటింగ్.
This post was last modified on March 16, 2026 4:57 pm
సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…
ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…
నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…
రణబాలినే కాదు ఇకపై తన సినిమాలు దేనికీ తన పరిధి మేరకు టికెట్ రేట్ల పెంపు ఉండకుండా చూసుకుంటానని విజయ్…
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…