Trends

SRH ఈ హెచ్చరికలు వినాల్సిందే..

‘ద హండ్రెడ్’ వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ వ్యవహారంపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. మనం ఇచ్చే ఫీజుల ద్వారా ఆ ఆటగాళ్లు పాక్ ప్రభుత్వానికి పన్నులు కడతారని, ఆ డబ్బుతో కొనే ఆయుధాలు మన సరిహద్దుల్లో సైనికుల ప్రాణాలను తీస్తాయని ఆయన చేసిన హెచ్చరిక మేకర్స్‌ను ఆత్మరక్షణలో పడేసింది.

​గతంలో ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ వంటి జట్లు బంగ్లాదేశ్ ప్లేయర్ల విషయంలో ఇలాంటి విమర్శలు ఎదుర్కొన్నప్పుడు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి. కానీ ఇప్పుడు సన్‌రైజర్స్ ఏకంగా పాక్ ప్లేయర్‌ను ఎంచుకోవడం ఆ ఫ్రాంచైజీ బ్రాండ్ ఇమేజ్‌కే మైనస్‌గా మారుతోంది. కేవలం లీగ్ కోసం మన దేశ పౌరుల సెంటిమెంట్లను పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. గవాస్కర్ లాంటి సీనియర్ ఈ స్థాయిలో రియాక్ట్ అయ్యారంటే పరిస్థితి ఎంత సీరియస్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు.

​ఈ వ్యవహారం వల్ల సన్‌రైజర్స్ లీడ్స్ మ్యాచ్‌లను భారతీయ అభిమానులు బహిష్కరించే అవకాశం ఉందని గవాస్కర్ హెచ్చరించారు. మైదానంలో ఆటగాళ్లు ఎంత బాగా ఆడినా, గ్యాలరీల్లో జనం లేకపోతే ఆ గెలుపుకు విలువేముంటుందని ఆయన ప్రశ్నించారు. కోచ్ డానియల్ వెట్టోరీకి మన దేశ పరిస్థితులు తెలియకపోవచ్చు కానీ, యాజమాన్యం మాత్రం ఈ విషయంలో ముందుచూపుతో వ్యవహరించాల్సిందని ఆయన తన కాలమ్‌లో పేర్కొన్నారు.ఇప్పటికే సన్‌రైజర్స్ లీడ్స్ ఎక్స్ (ట్విట్టర్) ఖాతా నిలిపివేయబడటం ఈ నిరసనలకు నిదర్శనం. ​మరోవైపు బీసీసీఐ ఈ విషయంలో ‘చేతులు ఎత్తేసింది’. ఇది విదేశీ లీగ్‌కు సంబంధించిన విషయం కావడంతో తాము జోక్యం చేసుకోలేమని బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు.

అంటే ఇప్పుడు బంతి పూర్తిగా సన్‌రైజర్స్ యాజమాన్యం కోర్టులోనే ఉంది. అటు గవాస్కర్ హెచ్చరికలు, ఇటు ఫ్యాన్స్ ఆగ్రహం మధ్య కావ్య మారన్ బృందం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. జరిగిన తప్పును సరిదిద్దుకోవడానికి ఇంకా సమయం ఉందని గవాస్కర్ సూచించడం గమనార్హం. ​ఏదేమైనా ఒక పాక్ ప్లేయర్ ఎంపిక ఇప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇమేజ్‌పై కూడా ప్రభావం చూపేలా కనిపిస్తోంది. ఐపీఎల్‌లో అత్యంత క్రేజ్ ఉన్న జట్లలో ఒకటైన సన్‌రైజర్స్, ఇలాంటి వివాదాల వల్ల తన ఫ్యాన్ బేస్‌ను కోల్పోయే ప్రమాదం ఉంది. దేశభక్తి ముందు క్రికెట్ చిన్నదనే భావన ఉన్న మన దేశంలో, ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.

This post was last modified on March 16, 2026 11:14 pm

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

3 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

5 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

5 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

7 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

8 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

9 hours ago