రాజకీయాల్లో సాధారణంగా.. వ్యక్తుల కేంద్రంగా రాజకీయాలు సాగుతాయి. వ్యక్తుల నేపథ్యంలో.. వారి హవా.. ఆర్థిక పరిస్థితి.. వారి వెనుక ఉన్న ప్రజలు.. వారి వ్యూహాలు.. పరిస్థితి.. ఇలా.. అనేక విషయాలను పరిశీలించి.. నాయకులను ఎంపిక చేసుకుంటారు. దీంతో వ్యక్తికేంద్రాలుగానే .. రాజకీయాలు సాగుతున్న విషయం.. మనకు దేశవ్యాప్తంగా అన్ని చోట్లా కనిపిస్తోంది. అయితే.. వ్యక్తిని కేంద్రంగా చేసుకుని సాగిస్తున్న రాజకీయాలు.. కొన్ని సార్లు సక్సెస్ అవుతున్నాయి.. ఎక్కువ సార్లు విఫలం కూడా అవుతున్నాయి. ఉదాహరణకు.. ఏ పార్టీ అయినా.. వ్యక్తిపై నమ్మకం పెట్టుకుంటే.. ఆయనకు టికెట్ ఇస్తున్నాయి.
ఆయన పార్టీ జెండా కావొచ్చు.. తన అజెండా కావొచ్చు.. గెలుస్తున్నారు. ఒంటెత్తు పోకడలు పోయే వారు పోతున్నారు. లేకపోతే, రెండు చేతలా సంపాయించుకునేవారు కనిపిస్తున్నారు. ఇది అంతిమంగా.. పార్టీలకు మేలు చేయకపోగా.. చాలా నష్టం చేస్తోంది. వ్యక్తి కేంద్ర రాజకీయాలు.. వాస్తవానికి 1990లలో పెద్దగా లేవు. పార్టీ కేంద్రంగానే సాగేవి. పార్టీ తరఫున ఎవరు బరిలోకి దిగినా.. పార్టీని చూసి ఓట్లే సే పరిస్థితి వచ్చింది. గతంలో కాంగ్రెస్ అయినా.. తర్వాత ప్రాంతీయ పార్టీగా వచ్చిన టీడీపీ అయినా.. ఇదే పంథాలో ముందుకు సాగాయి. దీంతో పార్టీలకు విలువ, ప్రజల్లో బలిమి ఉండేది.
కానీ, రాను రాను.. జాతీయ పార్టీల నుంచి ప్రాంతీయ పార్టీల వరకు కూడా వ్యక్తి కేంద్ర రాజకీయాలు చేయడం అలవాటు అయిపోయింది. ఫలితంగా.. పార్టీల ప్రాభవం పోయి.. వ్యక్తుల ప్రభావం పడింది. ఇదే ఇప్పుడు.. టీడీపీని వెంటాడుతున్న శాపంగా మారింది. “మేం ఉండబట్టే.. ఆయన ముఖ్యమంత్రి అయ్యారు“, మేం కష్టపడి ఆయనను ముఖ్యమంత్రిని చేశాం.. అనే ధోరణలు 2014 తర్వాత.. టీడీపీలో జోరుగా వినిపించాయి. ఈ పరిస్థితిని ఆనాడే.. చంద్రబాబు ఖండించి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది.
కానీ, నాడు.. ఆయన ఏమనుకున్నారో.. ఏమో.. ఇలాంటి వారిని చూసీ చూడనట్టు వదిలేశారు. పలితంగా ఇప్పుడు పార్టీ ప్రాభవం ముందు.. వ్యక్తుల ప్రాబల్యమే.. పెద్దగా కనిపిస్తోంది. దీంతో నేతలను తయారు చేసే పార్టీలో నేతలే.. సమస్యగా మారారనేది నిష్టుర సత్యం అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on November 29, 2021 11:29 am
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…