ఏపీ ఉద్యోగులు పోరుబాటను ఎంచుకున్నారు. ఇక, ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు వారు రెడీ అయ్యారు. తమకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు.. గతంలో పాదయాత్ర సమయంలో వైసీపీ అధినేత జగన్ ఇచ్చిన హామీలు నెరవేరలేదని.. ముఖ్యంగా పీఆర్ సీ వంటి కీలకమైన.. అంశాల్లోనూ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని.. ఉద్యోగ సంఘాలు.. కొన్ని నెలలుగా ఆరోపిస్తున్నాయి. అదేసమయంలో ఎన్నికలకు ముందు.. సీపీఎస్ పింఛను విధానాన్ని రద్దు చేస్తామని.. అధికారంలోకి వచ్చిన వారంలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిన జగన్.. పాలనా పగ్గాలు చేపట్టి రెండున్నరేళ్లు అయినప్పటికీ.. మౌనంగా ఉండడంపై ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే కొన్నాళ్ల కిందట నుంచి ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. వాస్తవానికి గత ఏడాది ప్రభుత్వంతో కలిసి మెలిసి పోయిన.. ఉద్యోగులు.. అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌తో వివాదానికి దిగి సంచలనం సృష్టించారు. ప్రభుత్వానికి అనుకూలంగా మీడియా ముందుకు వచ్చారు. అయితే.. ప్రభుత్వంపై ఉద్యోగులు పెట్టుకున్న ఆశలు ఏ ఒక్కటీ నెరవేరని నేపథ్యంలో ఇప్పుడు.. వారు తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ రూపాల్లో ఉద్యమాలకు తెరదీయాలని చూస్తున్నారు. దీనిలో భాగంగా డిసెంబరు 1న ప్రభుత్వానికి నోటీసులు అందించాలని నిర్ణయించారు.
తాజాగా మీడియా ముందుకు వచ్చిన.. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం.. అమరావతి జేఏసీ, అమరావతి ఉద్యోగుల సంఘం.. ఇలా అందరూ ఒకే మాటపై నిలబడ్డారు. కనీసం ఒకటో తారీకున జీతాలు కూడా ఇవ్వలేకపోతోందని.. ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇప్పుడున్న పరిస్థితిలో ఉద్యమం తప్ప.. తమకు ప్రత్యామ్నాయం లేదని వెల్లడించారు. ఉద్యోగులను ప్రభుత్వం చాలా చిన్నచూపు చూస్తోందని వ్యాఖ్యానించారు. పీఆర్‌సీ, పెండింగ్ బకాయిలు.. సీపీఎస్, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను ప్రధానంగా చర్చిస్తు న్నారు. డిసెంబరు 16 నుంచి అన్ని తాలూకా కేంద్రాల్లోనూ ధర్నాలు, నిరసనలకు పిలుపునిచ్చారు. డిసెంబరు 21 నుంచి 26 వరకు జిల్లాల ప్రధాన కేంద్రాల్లో నిరసనలు, ధర్నాలు వ్యక్తం చేస్తారు. అదేవిధంగా డిసెంబరు 27న విశాఖ.. 30న తిరుపతి, జనవరి 3న ఏలూరుల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు.
ఇదీ.. కార్యాచరణ..
This post was last modified on November 28, 2021 10:17 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…