దాదాపు రెండేళ్లకు పైగా రైతుల పోరాటం.. పోలీసుల నుంచి లాఠీ దెబ్బలు.. అవమానాలు..మంత్రుల నుంచి ఈసడింపు మాటలు.. వెరసి.. అమరావతి విషయం రగిలిన భోగిమంటలా.. కొనసాగింది. రైతులు వెనుదిరిగేది లేదని.. తమ త్యాగాలు వృథా కారాదని.. స్పష్టం చేస్తూ.. అమరావతికోసం. ఉద్యమించారు. మూడు రాజధానులను తిరస్కరించారు. అయితే.. తాము వెనక్కి తగ్గేదిలేదని., ప్రభుత్వం భీష్మించింది.
దరిమిలా కోర్టులో ఈ కేసులు నానడం..రోజువారి విచారణ జరుగుతుండడం సర్వత్రా తీవ్ర ఉత్కంఠకు వివాదానికి దారితీసింది. అయితే.. ఇప్పుడు ప్రభుత్తమే ఉన్నపళాన ఈ మూడు రాజధానుల బిల్లుతోపాటు.. సీఆర్‌డీయే రద్దు చట్టాన్ని కూడా రద్దు చేస్తున్నట్టు హైకోర్టుకు తెలిపింది.
ఈ క్రమంలో ఉరుములేని పిడుగులా వచ్చిన ఈ నిర్ణయం ఒకవైపు రైతులను ఆనందంలో ముంచెత్తింది. మరోవైపు విశ్లేషకులు..రాజకీయ నేతలను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. దీని వెనుక అసలు ఏం జరిగింది? అనే చర్చ జోరుగా సాగుతోంది. మడమ తిప్పేది లేదని పదేపదే చెప్పిన జగన్.. అమరావతిని భ్రమరావతి అంటూ.. వ్యంగ్యాస్త్రాలు సంధించిన వైసీపీ నాయకులు.. ఇప్పుడు ఒక్కసారిగా రైతుల నెత్తిన పాలు పోయడం వెనుక.. జరిగిన విషయాలేంటి? అసలు ఏం జరిగింది? అనే చర్చ జోరుగా సాగుతోంది.
దీనికి ఇప్పటికిప్పుడు మనకు రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి.. నిన్న మొన్నటి వరకు అమరావతి ఉద్యమానికి దూరంగా ఉన్న బీజేపీ. రెండు.. రాజకీయంగా వైసీపీ ఎదుర్కొంటున్న వివాదాలు.. దీనికి వస్తున్న వ్యతిరేకత.
బీజేపీ విషయాన్ని చూసుకుంటే.. నిన్న మొన్నటి వరకు కూడా అమరావతికి దూరంగా ఉంది. అయితే.. ఇటీవల బీజేపీ అగ్రనేత అమిత్ షా ఏపీ పర్యటనలో అమరావతికి మద్దతు ఇవ్వాలని రాష్ట్ర నేతలను ఆదేశించారు. ఈ క్రమంలో వారంతా కూడా రంగంలోకి దిగారు. ఇది.. ఏపీ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది ఎందుకంటే..రేపు మూడు రాజధానులు అంటే.. కేంద్రంలోని బీజేపీ పెద్దల మద్దతు లేకపోతే..ఒక్క పుల్ల తీసి అటు వేయలేరు. ఇటు వేయలేరు. సో.. అమరావతికి బీజేపీ మద్దతు విషయం సంకటంగా మారింది. దీంతో ఇది తెగేది కాదని.. లాక్కుంటే నష్టపోతామని.. జగన్ నిర్ణయం తీసుకుని వుంటారని అంటున్నారు.
అదేసమయంలో రాజకీయంగా ఇప్పుడు వెల్లువెత్తిన వివాదాలతో వైసీపీకి మైలేజీ పూర్తిగా తగ్గిపోయింది. దీనికి తోడు ఈ రెండున్నరేళ్లలో అభివృద్ది అనేది భూతద్దం పెట్టుకుని వెతికినా కనిపించడం లేదు. దీనికి రాజధాని లేక పోవడమేనని స్పష్టంగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తన పరిస్థితి మరింత సంకటంగా మారుతుందని.. గ్రహించే అమరావతిపై వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఇక, వీటికి తోడు.. రాజధానిరైతులకు అన్ని వర్గాల నుంచి పోటెత్తుతున్న మద్దతు కూడా రాజధాని విషయంలో మడమ తిప్పడానికి కారణమని అంటున్నారు.
This post was last modified on November 22, 2021 2:39 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…